పాకిస్తాన్ కి షాక్.. ఫైనల్ రేసు నుంచి ఔట్?

praveen
పాకిస్తాన్ జట్టు గత కొంతకాలం నుంచి టెస్ట్ ఫార్మాట్లో పేలువమైన ప్రదర్శన చేస్తూ విమర్శలు ఎదుర్కొంటుంది అన్న విషయం తెలిసిందే. ఏకంగా సొంత గడ్డపై వరుసగా టెస్టు సిరీస్ జరుగుతున్నప్పటికీ ఎక్కడ తమ ప్రభావాన్ని మాత్రం చూపించలేక పోతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే మొన్నటికి మొన్న పాకిస్తాన్ పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్ జట్టుతో టెస్ట్ సిరీస్ ఆడింది. ఇక మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో భాగంగా వరుసగా మూడు మ్యాచ్ లలో ఓడిపోయింది. ఇంగ్లాండు దూకుడు అయిన ఆట ముందు పాకిస్తాన్ సొంతగడ్డపై కూడా తేలిపోయింది అని చెప్పాలి.

 ఎక్కడ కనీస పోటీ ఇవ్వలేక చివరికి వరుసగా మూడు మ్యాచ్ లలో ఓడిపోయి సొంతగడ్డకు పైనే క్లీన్స్ స్వీప్ అయ్యి తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంది. అయితే ప్రస్తుతం ఇక పాకిస్తాన్ పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్ ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇంగ్లాండు పై క్లీన్స్వీప్ కారణంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రేసులో వెనకబడిపోయిన పాకిస్తాన్ న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్ లో మాత్రం సత్తా చాటి మళ్లీ పుంజుకుంటుందని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో మొదటి మ్యాచ్ డ్రాగ ముగిసింది అన్న విషయం తెలిసిందే.

 అయితే ఇలా న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ డ్రా గా ముగియడంతో చివరికి పాకిస్తాన్ కు ఊహించని షాక్ తగిలింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రైస్ నుంచి నిష్క్రమించింది. ఇంగ్లాండ్ చేతిలో ఓటమితో పాయింట్ల పట్టికలో దిగువకు పడిపోయిన పాకిస్తాన్ కివిస్ తో జరిగిన తొలి టెస్ట్ డ్రా చేయడంతో ఫైనల్ అర్హత సాధించే ఛాన్స్ పూర్తిగా పోగొట్టుకుంది అని చెప్పాలి. మొత్తంగా 2021 - 23 సీజన్లో పాకిస్తాన్ 13 టెస్ట్ మ్యాచ్లు ఆడింది. ఇందులో నాలుగు విజయాలు, ఆరు ఓటములు ఉండగా మూడు మ్యాచ్లు డ్రాగా ముగిసాయ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: