అలా అయితే.. పృథ్విషాకు దేశం కోసం ఆడే ఇంట్రెస్ట్ లేనట్టే : గంభీర్

praveen
ఇటీవల కాలంలో దేశవాలి క్రికెట్ లో బాగా రాణిస్తున్న ఎంతో మంది యువ ఆటగాళ్లు టీమిండియాలో అవకాశం దక్కించుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే. కానీ ఇప్పటికే టీమిండియా తరఫున అరంగేట్రం చేసి మంచి ఇన్నింగ్స్ ఆడి ఫామ్ కోల్పోయి జట్టులో స్థానం కోల్పోయిన పృద్విషా మాత్రం దేశవాళి క్రికెట్లో రాణించిన మళ్లీ టీం ఇండియాలోకి మాత్రం రాలేకపోతున్నాడు. ప్రతి సారి ఎంతో ఆశగా జట్టులో స్థానం దక్కుతుందేమో అని ఎదురు చూడటం.. చివరికి నిరాశ పడటం అతని వంతవుతుంది అని చెప్పాలి. ఇకపోతే పృద్విషాకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలి అంటూ మాజి క్రికెటర్ గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానించాడు.

 ఆట తీరు గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కోచులు సెలెక్టర్లు ఎందుకు ఉన్నారు. జట్టుకు ఎంపిక చేయడం వారి ఆట పరీక్షించడం మాత్రమే వారి పని కాదు. ముఖ్యంగా కుర్రాళ్ళు.. మరీ ముఖ్యంగా పృద్విషా లాంటి ఆటగాళ్ళను సరైన దారిలో నడిపించాల్సిన బాధ్యత కూడా వారిపై ఉంది. దీనిపై కోచులు సెలెక్టర్లు యాజమాన్యం దృష్టి సారించాలి. వెంటనే రాహుల్ ద్రవిడ్ లేదా సెలక్షన్ చైర్మన్ పృథ్వి షా తో మాట్లాడితే బాగుంటుంది. అతడికి ఒక స్పష్టత కల్పించి ఎల్లప్పుడూ జట్టునే ఉంచాలి.

 ఇక ఆటగాళ్లలో ఎవరైతే సరైన దారిలో లేరో ఇక వారిని జట్టుతో పాటే ఉండేలా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు వారిని పర్యవేక్షిస్తూనే ఉండాలి. తర్వాత వారిని వదిలిపెట్టిన క్షణం వారు అన్ని చోట్లకు వెళ్ళగలరు.. ఎక్కడైనా మంచి ప్రదర్శనతో రాణించగలరు. దేశం కోసం ఆడాలని అభిరుచి అంకితభావం ఉండే ఆటగాళ్లు ఎవరైనా సరే ఖచ్చితంగా ఫిట్నెస్ క్రమశిక్షణ వంటి అంశాలను అలవర్చుకోవడం ఎంతో ముఖ్యం. ఇక అలా పాటించమని పృద్విషాని ఒత్తిడి చేసే శిక్షకులు ఉన్నారు. అయితే పృద్విషాకు మరిన్ని అవకాశాలు కల్పించాలి ఒకవేళ అప్పటికి ఆడకపోతే అతనికి దేశం తరపున ఆడే అభిరుచి లేదు అని డిసైడ్ అవ్వాలి అంటూ గౌతమ్ గంభీర్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: