వామ్మో ఖడ్గమృగం.. ఎంత దారుణంగా వెంటాడింది.

praveen
ఇటీవల కాలంలో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్లు ఏకంగా అడవి జంతువుల దగ్గరికి వెళ్లి వాటిని వీడియోలు ఫోటోలు తీయడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక ఇలా కాస్త రిస్క్ చేసి మరి ప్రమాదకరమైన జంతువుల దగ్గరికి వెళ్లడానికి ఎంతో ఇష్టపడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే కొన్ని కొన్ని సార్లు జంతువులు ఇక ఇలా చూసి చూడనట్లుగానే వ్యవహరిస్తే కొన్నిసార్లు ఏకంగా దూసుకు వచ్చి దాడులకు పాల్పడటం లాంటివి చేస్తూ ఉంటారూ అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది.
 అడవుల్లో ఉండే ప్రమాదకరమైన జంతువులలో ఖడ్గమృగం కూడా ఒకటి అని చెప్పాలి. అయితే ఖడ్గం మృగం చూసేందుకు ఎంత ప్రశాంతంగా కనిపిస్తూ ఉంటుందో.. దానికి కోపం వస్తే సృష్టించే విధ్వంసం కూడా అంతే భయంకరంగా ఉంటుంది అని చెప్పాలి. ఇక ఒక్కసారి ఖడ్గమృగం దాడి చేసింది అంటే ఇక ఆ దాడి ఊహకందని రీతిలో ఉంటుంది అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల సఫారీకి జంతువులను చూసేందుకు వెళ్లిన కొంతమంది పర్యటకులకు ఊహించని చేదు అనుభవం ఎదురయింది అని చెప్పాలి. ఒక భారీ ఖడ్గం మృగం వారిని తరుముకుంటూ రావడంతో ప్రాణాలు గాల్లో కలిసిపోయినంత పని అయింది..

 తాము ప్రయాణిస్తున్న వాహనాన్ని ఎంతో వేగంగా పోనిచినప్పటికీ ఇక వారిని వెంబడించిన ఖడ్గమృగం జీపుకు అత్యంత సమీపానికి చేరుకోవడంతో చివరికి వాహనంలో ఉన్న పర్యటకులు అందరూ కూడా భయంతో కేకలు వేశారు. చివరికి ఖడ్గం మృగం వెనక్కి తగ్గడంతో హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు అని చెప్పాలి. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా  వైరల్ గా మారిపోయింది. అయితే ఇది అస్సాం రాష్ట్రంలో జరిగింది అన్నది తెలుస్తుంది. గతంలో కూడా ఇదే రాష్ట్రంలోని మానస జాతీయ పార్కులో కూడా ఇలాంటి తరహా ఘటన జరిగింది. సఫారీ జీపును ఖడ్గమృగం భయంకరంగా వెంటాడింది అని చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: