పంత్ ను కాపాడిన బస్సు డ్రైవర్ కి.. ఎంత బహుమతి ఇచ్చారో తెలుసా?

praveen
టీమ్ ఇండియాలో స్టార్ ఆటగాడిగా కొనసాగుతున్న వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఇటీవల రోడ్డు ప్రమాదం బారిన పడ్డాడు అన్న విషయం తెలిసిందే. తెల్లవారు జామున కారు లో వెళుతున్న సమయం లో ఉత్తరాఖండ్లోని రూర్కి సమీపంలో కారు అదుపుతప్పి ప్రమాదం బారిన పడ్డాడు. ఏకంగా రహదారి పక్కనున్న రైలింగ్ను ఢీ కొట్టిన కారు 200 మీటర్ల వరకు అలాగే దూసుకుపోయింది. అయితే ఈ ఘటనలో కారు అక్కడికక్కడే కాళీ బూడిదయింది అన్న విషయం విషయం తెలిసిందే.

 జరగబోయే ప్రమాదాన్ని ముందుగానే ఊహించిన రిషబ్ పంత్ ఏకంగా ప్రమాదం జరగడానికి క్షణాల ముందే కారు నుంచి దూకేయడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. అయినప్పటికీ కారు వేగంగా ఉండడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు అన్న విషయం తెలిసిందే. అయితే రిషబ్ పంత్ గాయాల బారిన పడిన నేపథ్యంలో ఏకంగా ఒక బస్సు డ్రైవర్ రిషబ్ పంతును కాపాడి స్థానిక ఆసుపత్రికి తరలించడం గమనార్హం. అయితే రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భారత క్రికెటర్ రిషిప్ పంతును గోల్డెన్ అవర్లో ఆసుపత్రికి తరలించినట్లు ఉత్తరాఖండ్ పోలీసులు ప్రకటించారు.

 ఏమాత్రం ఆలస్యమైనా రిషబ్ పంత్ ప్రాణాలకే ప్రమాదం జరిగేది అన్న విషయాన్ని కూడా తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే సంఘటన స్థలం లో ఉన్న హర్యానా రాష్ట్రానికి చెందిన రోడ్ వేస్ బస్సు డ్రైవర్ గా పనిచేస్తున్న సుశీల్ కుమార్ వెంటనే అంబులెన్స్ కి సమాచారం అందించాడు. ఇక అంతే కాదు రిషబ్ పంతును అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించడానికి బస్సు కండక్టర్గా ఉన్న వ్యక్తి కూడా సహకరించాడు. ఈ క్రమంలోనే సరైన సమయంలో స్పందించి రిషబ్ పంతును కాపాడిన ఇద్దరికీ కూడా గుడ్ సమరిటన్ స్కీం కింద ఒక్కొక్కరికి 5 వేల రూపాయలు బహుమతిగా ఇవ్వనున్నారు పోలీసులు. రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: