రోజాను వదలని కృష్ణ భగవాన్.. అదిరిపోయే పంచ్?

praveen
ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమం బుల్లితెర ప్రేక్షకులందరికీ కూడా అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ కి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. అయితే జబర్దస్త్ లో ఒకప్పటి హీరోయిన్ రోజా ఎవరు గ్రీన్ జడ్జిగా కొనసాగుతుంది. ఎందుకంటే రోజాకి హీరోయిన్గా ఎంత గుర్తింపు వచ్చిందో ఇక్కడ జబర్దస్త్ జడ్జిగా మారిపోయిన తర్వాత అంతే గుర్తింపు వచ్చింది అని చెప్పాలి. ఏకంగా జబర్దస్త్ జడ్జిగా మారిన తర్వాతే ప్రజలకు బాగా దగ్గరయింది. ఇక ఎన్నికల్లో గెలవడానికి కూడా జబర్దస్త్ ఒక కారణం అని చెప్పాలి. అయితే మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇక జబర్దస్త్ జడ్జిగా గుడ్ బై చెప్పేసింది రోజా.

 దీంతో జబర్దస్త్ అభిమానులు అందరూ కూడా రోజా నవ్వులను మిస్ అవుతున్నారు అని చెప్పాలి. ఇకపోతే జబర్దస్త్ 500 ఎపిసోడ్ కి ఇటీవలే రోజా మరోసారి జడ్జిగా ప్రత్యక్షమై తనదైన జడ్జిమెంట్తో ప్రేక్షకులను అలరించారు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో విడుదలై వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. రోజా రాకతో  జబర్దస్త్ స్టేజ్ మొత్తం మరోసారి కలకలలాడిపోయింది అని చెప్పాలి. ఈ ప్రోమోలో భాగంగా రాఘవ స్కిట్ లో రాజు గారి వేషంలో స్టేజి మీదకి వచ్చి.. జడ్జి సీట్లో కూర్చున్న రోజను చూపిస్తూ.. ఆవిడని ఎప్పుడో ఎక్కడో చూసినట్టుందే అంటూ డైలాగ్ చెబుతూ ఉండగా.. పక్కనే ఉన్న కో కమెడియన్ ఏంటి ఇచ్చి నీకు బాగా బలిసింది.. ఆవిడతో కలిసి తిరుపతి వెళ్లి.. ఫ్రీగా లడ్డు తీసుకొని ఇప్పుడు ఎవరు అంటావ అనేసరికి రోజా నవ్వేసింది.

 ఇక ఆ తర్వాత రోజా గారు మీ కౌంటర్లను మేము బాగా మిస్ అవుతున్నాం అంటూ రాకెట్ రాఘవ అంటాడు. ఇక అంతలో స్పాంటేనియస్ పంచులతో ఎప్పుడు ఆశ్చర్యపరిచే కృష్ణ భగవాన్ మరోసారి తన స్పాంటినిటీ  చూపించాడు అని చెప్పాలి. రోజా మేడం మొన్నటి వరకు మీ మీద కౌంటర్లు వేశారు. ఇప్పుడు వేరే దగ్గర వేస్తున్నారు అంటూ ఒక పంచ్ వేయడంతో ఏకంగా పక్కన ఉన్న రోజ పగలబడి నవ్వుకున్నారు. ఇక ఈ పంచ్ విన్న తర్వాత కృష్ణ భగవాన్ కేవలం జబర్దస్త్ లో కమెడియన్స్ ని మాత్రమే కాదు జడ్జిని కూడా వదలకుండా పంచుల వర్షం కురిపిస్తున్నాడు అంటూ నేటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: