హెరల్డ్ ఫ్లాష్ బ్యాక్ 2025: ఈ ఏడాది పూజా హెగ్డే పరువు నిలబెట్టిన సినిమా ఇదే.. దేవుడు కరుణించాడు..!

Thota Jaya Madhuri
ఈ ఏడాది సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్‌కు పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందే. కొందరికి అవకాశాలు తగ్గాయి, మరికొందరు సరైన హిట్స్ లేక ఇబ్బంది పడ్డారు. అయితే ఈ పరిస్థితుల మధ్య పూజా హెగ్డేకు మాత్రం ఈ ఏడాది కొంత భిన్నంగా, ఆసక్తికరంగా గడిచిందని చెప్పాలి. మొత్తం మీద ఈ ఏడాది ఆమె నాలుగు సినిమాలతో ప్రేక్షకులను పలకరించింది.ఈ నాలుగు సినిమాల్లో ముఖ్యంగా హౌస్‌ఫుల్ 5, దేవా, రెట్రో మరియు కూలీ సినిమాలు విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ఈ సినిమాలన్నింటిలోనూ పూజా హెగ్డే పేరు నిజంగా హైలైట్ అయిన సినిమా మాత్రం ఒక్కటే అని చెప్పాలి. అది మరేదో కాదు — కూలీ.



కూలీ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ పాత్రలో కాకుండా, ప్రత్యేకంగా ఒక ఐటమ్ సాంగ్‌లో కనిపించింది. సాధారణంగా హీరోయిన్స్‌కు ఇలాంటి స్పెషల్ సాంగ్స్ కెరీర్‌కు పెద్దగా ఉపయోగపడవు అనే అభిప్రాయం ఉంటుంది. కానీ పూజా హెగ్డే విషయంలో మాత్రం ఇది పూర్తిగా రివర్స్ అయింది. ఐటమ్ సాంగ్ అయినప్పటికీ, ఆమె ప్రెజెన్స్, డాన్స్, గ్లామర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.మిగతా మూడు సినిమాలతో పోలిస్తే, పూజా హెగ్డే పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపించడానికి కారణమైన సినిమా ఇదే కావడం విశేషం. ముఖ్యంగా ఆ పాటలో ఆమె లుక్, డాన్స్ మూమెంట్స్ అభిమానులను మంత్రముగ్ధులను చేశాయి. పాట విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియా మొత్తం పూజా హెగ్డే గురించే చర్చలు జరిగాయి. అభిమానులు మాత్రమే కాదు, సాధారణ ప్రేక్షకులు కూడా ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు.



ఈ ఐటమ్ సాంగ్ ద్వారా పూజా హెగ్డే మరోసారి “ఈ ఏడాది నేను కూడా ఉన్నాను” అని గుర్తు చేసినట్టైంది. మిగతా సినిమాలు పెద్దగా ప్రభావం చూపకపోయినా, కూలీ మాత్రం ఆమెకు కావాల్సిన గుర్తింపును తీసుకొచ్చింది. ఒకవేళ ఈ సినిమా, అందులోని ఆ ప్రత్యేక పాట ఆమె చేయకపోయి ఉంటే, ఈ ఏడాది పూజా హెగ్డే పేరు అంతగా వినిపించేదే కాదని చెప్పేవాళ్లు కూడా లేకపోలేదు.అందుకే కొందరు నెటిజన్లు సరదాగా ట్రోల్స్ కూడా చేస్తున్నారు. “దేవుడు కరుణించి పూజా హెగ్డేకు కూలీ సినిమాలో ఐటమ్ సాంగ్ ఇచ్చాడేమో” అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తున్నారు. ట్రోల్స్ ఎలా ఉన్నా, నిజం మాత్రం ఒకటే — ఈ ఏడాది పూజా హెగ్డేకు కాస్త కూస్తగా కలిసి వచ్చిన సినిమా కూలీనే. ఇప్పుడు అందరి దృష్టి వచ్చే ఏడాదిపై ఉంది. వచ్చే ఏడాదైనా పూజా హెగ్డే హీరోయిన్‌గా ఒక సాలిడ్ హిట్ కొట్టి, మళ్లీ తన పాత ఫామ్‌ను సంపాదించుకుంటుందా? లేక ఇదే తరహాలో ప్రత్యేక పాత్రలకే పరిమితమవుతుందా? అన్నది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: