8 ఏళ్ల క్రితం ఇదే రోజు.. ధోని ఫ్యాన్స్ కి హార్ట్ బ్రేక్?

praveen
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం భారత క్రికెట్ చరిత్రలో ఎంతోమంది స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన పేజీలు లికించుకున్నాడు  మహేంద్రసింగ్ ధోని. ఒక టికెట్ కలెక్టర్ స్థాయి నుంచి దేశం గర్వించదగ్గ క్రికెటర్ స్థాయికి ఎదిగిన మహేంద్ర సింగ్ ధోనీ ప్రస్థానం ప్రతి యువ ఆటగాడికి కూడా స్ఫూర్తిదాయకం అని చెప్పాలి. కేవలం బెస్ట్ కెప్టెన్ గా మాత్రమే కాదు బెస్ట్ ఫినిషర్గా బెస్ట్ వికెట్ కీపర్ గా కూడా ప్రపంచ క్రికెట్లో హవా నడిపించాడు మహేంద్ర సింగ్ ధోని.

 ఎంతో ఒత్తిడిలో అయినా సరే కూల్ గా కనిపిస్తు అభిమానుల మనసులు దోచుకుంటూ ఉంటాడు.  అయితే అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కేవలం అటు ఐపిఎల్ లో మాత్రమే తన ఆటతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక అందరికి క్రికెటర్ల లాగా ధోని సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడు అన్న విషయం తెలిసిందే. దీంతో ధోనీకి సంబంధించిన ఏ విషయం తెర మీదకి వచ్చినా కూడా అది సోషల్ మీడియాలో నిమిషాల వ్యవధిలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి.  అయితే ఇదే రోజు ధోని అభిమానులందరికీ కూడా హార్ట్ బ్రేక్ ఆయన రోజు అన్న విషయం తెలిసిందే. సరిగ్గా 8 ఏళ్ల క్రితం ఊహించని షాక్ ఇచ్చాడు మహేంద్ర సింగ్ ధోని.

 అప్పటివరకు మూడు ఫార్మాట్లకు కెప్టెన్ గా కొనసాగుతూ ఎంతో విజయవంతమైన సారధిగా హవా నడిపిస్తున్న మహేంద్ర సింగ్ ధోని సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం ఇదే రోజున టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. ధోని నిర్ణయంతో అభిమానుల హార్ట్ బ్రేక్ అయింది అని చెప్పాలి. కాగా టెస్టులలో ధోని 38.09 సగటుతో 4876 పరుగులు చేసి అత్యుత్తమ వికెట్ కీపర్ గా, బ్యాట్స్మెన్ గా కూడా నిలిచాడు. ధోని కెప్టెన్సీలోనే టీమ్ ఇండియా టెస్ట్ ఫార్మాట్లో నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: