డివిలియర్స్ తర్వాత.. అన్ని వైపుల షాట్లు ఆడేది అతనొక్కడే : వార్నర్

praveen
గత కొంతకాలం నుంచి టెస్ట్ ఫార్మాట్లో వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న డేవిడ్ వార్నర్ ఏ రేంజ్ లో విమర్శలు ఎదుర్కొన్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా స్టార్ ప్లేయర్ అయినప్పటికీ అతన్ని జట్టు నుంచి పక్కన పెట్టాలి అంటూ ఎంతో మంది డిమాండ్ చేసే స్థాయిలో అతను వైఫల్యాన్ని కొనసాగించాడు. కానీ ఇటీవల సౌత్ ఆఫ్రికా తో జరిగిన రెండో టెస్టులో భాగంగా డబుల్ సెంచరీ తో చెలరేగిపోయి తన పూర్వపు ఫామ్ అందుకుని అభిమానులందరికీ ఉపశమనం కలిగించాడు అని చెప్పాలి. 255 బంతుల్లో 16 ఫోర్లు రెండు సిక్సర్లతో డబుల్ సెంచరీ బాదిన డేవిడ్ వార్నర్ ఆ తర్వాత కండరాలు పట్టేయడంతో రిటైర్డ్ హర్ట్ గా వెనుతిరిగాడు.

 ఇక ఈ రెండవ టెస్టులో భాగంగా ఒక ఇన్నింగ్స్ సహా భారీ పరుగుల తేడాతో ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించి ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది అని చెప్పాలి. అయితే ఇటీవల మీడియాతో మాట్లాడిన డేవిడ్ వార్నర్ ప్రపంచ క్రికెట్లో అన్ని షాట్లు ఆడగల క్రికెటర్లు ఎవరు అన్న విషయాన్ని తేల్చి చెప్పేసాడు. ఇప్పటికే సౌత్ ఆఫ్రికా మాజీ క్రికెటర్ అయిన ఏపీ డివిలియర్స్ మైదానం నాలువైపులా ఎంతో సమర్థవంతంగా షాట్లు వాడి మిస్టర్ 360 ప్లేయర్గా గుర్తింపు సంపాదించుకున్నాడు.

 ఏబి డివిలియర్స్ బ్యాటింగ్ చేస్తూ ఉంటే క్రికెట్ ప్రపంచం మొత్తం అలా చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అతను ఎప్పుడూ ఊహకు అందని షాట్లు ఆడుతూ ఉంటాడు. అందుకే అతనికి మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్గా గుర్తింపు వచ్చింది అంటూ డేవిడ్ వార్నర్ చెప్పుకొచ్చాడు. అయితే ఏబి డివిలియర్స్ తో పాటు టీమ్ ఇండియా మాజీ కెప్టెన్  విరాట్ కోహ్లీ సైతం ఇలా మైదానం అలువైపులా షాట్లు ఆడగలడు అంటూ డేవిడ్ వార్నర్ చెప్పుకొచ్చాడు. టైం వస్తే విధ్వంసానికి మించిన ప్లేయర్గా విరాట్ కోహ్లీ మారిపోతూ ఉంటాడు. పాకిస్తాన్తో మ్యాచ్లో కోహ్లీ బ్యాటింగ్ చూస్తే ప్రతి ఒక్కరికి ఈ విషయం అర్థం అవుతుంది.ఎన్నో అద్భుతమైన షాట్లు ఆడే సత్తా ఉన్నప్పటికీ సింపుల్గా రన్స్ వస్తుంటే అలాంటి షాట్లు ఎందుకు అని కోహ్లీ ఎక్కువగా 360 డిగ్రీస్ షాట్లు ఆడడు అంటూ డేవిడ్ వార్నర్ ప్రశంసించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: