పాకిస్తాన్ వల్లే.. హార్దిక్ కెప్టెన్ అయ్యాడు : రమిజ్ రజా

praveen
సాధారణంగా పాకిస్తాన్ ,భారత్ జట్ల మధ్య క్రికెట్ సంబంధాలపై నిషేధం కొనసాగుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అన్ని దేశాల జట్లలతో ద్వైపాక్షిక సిరీస్ లు ఆడే టీమ్ ఇండియా జట్టు ఒక్క పాకిస్తాన్ తో మాత్రం ద్వైపాక్షిక సిరీస్ లకు దూరంగా ఉంటుంది. కేవలం ఐసీసీ టోర్నీలలో మాత్రమే తలబడుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.  అయితే ఇక అటు దాయాది దేశాల ఆటగాళ్లు అయినప్పటికీ ఇరుజట్ల ఆటగాళ్లు మాత్రం స్నేహితుల మెలుగుతూ ఉంటారు. కానీ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించి ఇంట్లో కూర్చునే మాజీ ఆటగాళ్లు మాత్రం ఎప్పుడూ బీసీసీఐపై ఇక భారత జట్టులోని ఆటగాళ్లపై తమ అక్కసును వెళ్లగకుతూ ఉంటారు అని చెప్పాలి.

 భారత ఆటగాళ్లపై ఎప్పుడు విమర్శలు గుప్పించేందుకు అవకాశం దొరుకుతుందా అని గద్దల్ల వేచి చూసే పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లు ఇక బీసీసీఐలో జరిగే చిన్న మార్పును కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటూ గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు అని చెప్పాలి.  అయితే గత కొంతకాలం నుంచి టీమిండియా పై విమర్శలు చేస్తూ చేస్తూ వార్తలో హాట్ టాపిక్ గా మారిపోయిన పాకిస్తాన్ మాజీ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు రమిజ్ రాజా పదవి పోయినా కూడా తన తీరు మార్చుకోలేదు అని చెప్పాలి. భారత జట్టుపై మరోసారి తన అక్కస్సును వెలగకుతూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

 ఇటీవలే బిసిసిఐ టీమ్ ఇండియా టి20 కెప్టెన్ గా హార్దిక్ పాండ్యాకు బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక ఇదే విషయాన్ని తనకు అనుకూలంగా మాట్లాడాడు రమిజ్ రాజా. టి20 ప్రపంచ కప్ లో టీం ఇండియా కన్నా పాకిస్తాన్ మెరుగైన ప్రదర్శన చేసిందని.. అందుకే బీసీసీఐ టీమ్ ఇండియా జట్టులో సెలక్షన్ కమిటీలో మార్కులు చేయడమే కాక చివరికి జట్టు కెప్టెన్ ని కూడా తప్పించాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ రమిజ్ రజా సంచలన వ్యాఖ్యలు చేశాడు. బిలియన్ డాలర్ల సంపద ఉన్న భారత జట్టు పాక్ కంటే వెనుకబడింది. బాబర్ అజాం కెప్టెన్సీ లో పాకిస్తాన్ మరింత బలోపేతం అయింది అంటూ వ్యాఖ్యానించాడు. ఇక అతని వ్యాఖ్యలపై స్పందిస్తున్న టీమిండియా ఫ్యాన్స్ గొప్పలు చెప్పుకోవడంలో మీకంటే తోపులు ఇంకెవరూ లేరు అంటూ సెటైర్లు వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: