హీరో రవితేజ కాళ్లు మొక్కిన.. దర్శకుడు హరీష్ శంకర్?

praveen
హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్న రవితేజ ఇటీవల మరో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టేశాడు అన్న విషయం తెలిసిందే. నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో తెరకెక్కిన  ధమాకా సినిమాతో ఇటీవల ప్రేక్షకులు ముందుకు వచ్చాడు రవితేజ. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ సరసన శ్రీ లీల నటించింది అన్న విషయం తెలిసిందే. మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అటు థియేటర్లలో దుమ్ము రేపుతుంది. ఇప్పటికే 50 కోట్ల వసూళ్లను బ్రేక్ చేసిన ఈ సినిమా ఇక ఇప్పుడు 100 కోట్ల వైపుగా దూసుకుపోతుంది అని చెప్పాలి. ఇటీవల సక్సెస్ మీట్ కూడా నిర్వహించింది చిత్ర బృందం.

 ఈ క్రమంలోనే ఈ సక్సెస్ మీట్ లో హాజరైన దర్శకుడు హరీష్ శంకర్ రవితేజ గురించి మాట్లాడిన తీరు కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. మాస్ మహారాజ్ అని రవితేజ నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు నుంచి పిలిచేవాడిని.. ఓ ఫంక్షన్ లో మాస్ మహారాజ్ అని సుమను పిలవమని చెప్పాను. అప్పటినుంచి ఆ పేరు ముందుకెళ్తుంది. చాలామందికి తెలుసు.. నేను ఈ స్టేజి మీద ఉన్నాను.. ఇండస్ట్రీలో ఉన్నాను అంటే అందుకు రవితేజ కారణమని అంటూ హరిష్ శంకర్ ఎమోషనల్ అయ్యారు. అదే సమయంలో దర్శకుడు హరిష్ శంకర్ ఏకంగా హీరో రవితేజ కాళ్ళ మీద పడి దండం పెట్టాడు అని చెప్పాలి.

 నేను కలిసిన ప్రతిసారి కూడా కౌగిలించుకోవడం చేస్తూ ఉంటాను. కాని సభ ముఖంగా నీకు ఎప్పుడు గౌరవం ఇవ్వలేదు. నీ మీద గౌరవం భక్తి ప్రేమను చెప్పాలనుకున్నాను. కాబట్టి నీ కాళ్లకు దండం పెట్టాను. అంతే తప్ప మరో విషయం లేదు అంటూ హరీష్ శంకర్ భావోద్వేగానికి లోనయ్యాడు. ఇక నా జీవితంలో కీలకమైన పది సంవత్సరాలు కూడా రవితేజ సమక్షంలోనే గడిచిపోయాయి అంటూ హరీష్ శంకర్ చెప్పుకొచ్చాడు. రవితేజ నాలాంటి వాళ్లకు ఎంతో మందికి జన్మనిచ్చాడు అంటూ హరిశంకర్ ఎంతగానో ఎమోషనల్ అయ్యాడు.  ఇక రవితేజ అన్నయ్య పై విమర్శలు చేసిన వారందరికీ ధమాకా హీట్ తో చెప్పుతో కొట్టినట్లు సమాధానం చెప్పాడు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు హరిష్ శంకర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: