అదే నా ఆటను మార్చేసింది : పూజారా

praveen
టీమిండియాలో టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ గా కొనసాగుతూ వున్నాడు శతేశ్వర పూజార. టీమ్ ఇండియా టెస్ట్ మ్యాచ్ ఆడుతుంది అంటే ఎవరు జట్టులో ఉన్నా లేకపోయినా అతను మాత్రం తప్పక జట్టులో స్థానం సంపాదించుకుంటూ ఉంటాడు అని చెప్పాలి. ఇక ఎంతో నిలకడైన ఆట తీరుకు మారుపేరైన చతేశ్వర పూజార కీలకమైన సమయంలో ప్రత్యర్థి  బౌలర్ల ఓపికను పరీక్షిస్తూ ఇక జట్టును విజయ తీరాల వైపు నడిపిస్తూ ఉంటాడు అని చెప్పాలి. అయితే టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ అనే ముద్ర పడిపోవడంతో పరిమిత ఓవర్ల ఫార్మాట్ కి పూర్తిగా దూరమైపోయాడు. అయితే గత కొంతకాలం క్రితం ఫామ్ కోల్పోయి జట్టుకు దూరమయ్యాడు అన్న విషయం తెలిసిందే.

 అయినప్పటికీ  పూజార మాత్రం ఎక్కడ తన పట్టుదలను కోల్పోలేదు. ఒకవైపు ఎంతో మంది యువ క్రికెటర్లు ఐపీఎల్ లో ఆడుతున్న సమయంలో అతను మాత్రం ఇంగ్లాండ్ కౌంటి ఛాంపియన్షిప్ లో ఆడుతూ తన ఆటను మరింత మెరుగుపరుచుకున్నాడు. ఎంతో నెమ్మదిగా ఆడటం మాత్రమే కాదు దూకుడు గా బ్యాటింగ్ చేయగల సత్తా కూడా తనలో ఉంది అన్న విషయాన్ని నిరూపించాడు. ఈ క్రమంలోనే సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించి బంగ్లాదేశ్ తో జరిగే టెస్ట్ సిరీస్ లో ఎంపికయ్యాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మొదటి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో 90 పరుగులు చేసి కీలకమైన ఇన్నింగ్స్ ఆడిన పూజార ఇక రెండవ ఇన్నింగ్స్ లో సెంచరీ తో చెలరేగిపోయాడు.

 దాదాపు 1400 రోజుల తర్వాత  పూజార సెంచరీ చేసి ఇక ఏళ్ల నిరీక్షణకు తెరదించాడు అని చెప్పాలి. అంతేకాదు ఇక తన మంచి ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కూడా దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే  ఇటీవల బంగ్లాదేశ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో మంచి ప్రదర్శన చేయడం పై స్పందించిన పూజార ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ తన ఆటను మెరుగుపరచుకోవడానికి ఎంతగానో ఉపయోగపడింది అంటూ చెప్పుకొచ్చాడు. టెస్ట్ మ్యాచ్ ల మధ్య గ్యాప్ ఉంటే ఆటగాళ్లు సన్నతం కావడానికి సమయం ఉంటుంది అంటూ అభిప్రాయపడ్డాడు.. మైదానంలోకి అడుగుపెట్టే ముందు ప్రతి ఆటగాడు మానసికంగా సన్నదం కావడం ఎంతో ముఖ్యం అంటూ పూజార చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: