ఐపీఎల్ హిస్టరీలో కొత్త రికార్డ్.. ఆ వికెట్ కీపర్ కు భారీ ధర?

praveen
వెస్టిండీస్ వికెట్ కీపర్ నికోలస్ పూరన్.. ఇతనికి పవర్ హిట్టర్ గా కూడా పేరు ఉంది. ఇప్పుడు వరకు వెస్టిండీస్ జట్టు తరఫున ఎన్నోసార్లు మెరుపు ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించిన సందర్భాలు ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఇక ఇప్పటివరకు ఐపీఎల్ లో కూడా పలు జట్ల తరఫున ప్రాతినిధ్యం వహించాడు. ఇక ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ సీసన్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున కూడా ఆడాడు అన్న విషయం తెలిసిందే. అయితే అతనిపై ఎంతో నమ్మకం పెట్టుకొని సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కొనుగోలు చేసింది.

 ఈ క్రమంలోనే 10.75 కోట్లను అతని కోసం వెచ్చించింది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. కానీ అతను మాత్రం ఎందుకో ఇక జట్టు యాజమాన్యం నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు అని చెప్పాలి. పవర్ హిట్టర్ గా పేరు ఉన్నప్పటికీ ఇక ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ సీజన్లో అతను అంతంత మాత్రమే బ్యాటింగ్ ప్రదర్శన చేశాడు. దీంతో ఇక అతను జట్టుకు భారంగా మారిపోయాడు అని భావించిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం  రిటెన్షన్ ప్రక్రియలో భాగంగా అతన్ని జట్టుతో అంటి పెట్టుకోకుండా వేలంలోకి వదిలేసింది. అయితే నికోలస్ పూరన్  ఇప్పటివరకు ఐపీఎల్లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయకపోయినప్పటికీ ఇటీవల ఐపీఎల్ మినీ వేలంలో అతనికి భారీ ధర పలికింది.

 ఏకంగా ఐపీఎల్ లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన  లక్నో సూపర్ చైన్స్ నికోలస్ పూరన్ కోసం పోటీపడి మరి 16 కోట్లకు దక్కించుకుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక ఇలా 16 కోట్లు దక్కించుకున్న నికోలస్ పూరన్ ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర దక్కించుకున్న వికెట్ కీపర్ గా నిలిచాడు నికోలస్ పూరన్. ఇప్పటివరకు ఏ వికెట్ కీపర్ కూడా 16 కోట్ల ధరను వేలంలో దక్కించుకోలేదు అని చెప్పాలి. ఈ ఏడాది తన ప్రదర్శనతో నిరాశపరిచిన నికోలస్ పూరన్ ఇక ఇప్పుడు లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఎలా రాణించబోతున్నాడు అన్నది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: