ఐపీఎల్ 2023: "ఆడం జంపా & అదిల్ రషీద్"ల కోసం పోటాపోటీ.. ?

VAMSI
ఇండియా ప్రీమియర్ లీగ్ కు సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారన్నది తెలిసిందే. సంవత్సరానికి ఒకసారి జరిగే ఈ రిచ్ లీగ్ లో ఆడాలని ఎందరో కుర్రాళ్ళు పోటీ పడుతుంటారు. ఇప్పటి వరకు 15 సీజన్ ల పాటు సక్సెస్ ఫుల్ గా జరిగి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. ఇక వచ్చే ఏడాది 16 వ సీజన్ స్టార్ట్ కానుంది, అందుకోసం ఈ నెలలో జరగబోయే మినీ వేలంలో ఎవరికి తమ జట్టుకు కొనుగోలు చేయాలన్న విషయంపై పది జట్లు చర్చలలో ఉన్నాయి. అన్ని జట్లు కూడా ఎవరి ప్లాన్ లలో వారు ఉన్నారు. ఇక తెలుగు రాష్ట్రాలకు చెందిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పటి వరకు తాను పాల్గొన్న సీజన్ లలో ఒక్కసారి మాత్రమే డేవిడ్ వార్నర్ కెప్టెన్సీ లో టైటిల్ ను అందుకుంది.
ఆ తర్వాత నుండి ఆశించిన ప్రదర్శన చేయడంలో పూర్తిగా విఫలం అవుతోంది. ఎన్నో అంచనాలు పెట్టుకున్న కెన్ విలియమ్సన్ కూడా జట్టును విజయపధంలో నడిపించలేక... మొన్న జరిగిన రిటెన్షన్ ప్రక్రియలో ఫ్రాంచైజీ చేత వేలానికి విడుదల చేయబడ్డాడు. కాగా ఇప్పుడు వేలంలో జట్టు యాజమాన్యం ఇద్దరు ఆటగాళ్లను మాత్రం ఎలాగైనా చేజిక్కించుకోవాలన్న ప్లాన్ లో ఉంది. ప్రస్తుతం సన్ రైజర్స్ కు కెప్టెన్ లేడన్న విషయం తెలిసిందే, గత సీజన్ కు కెప్టెన్ గా ఉన్న విలియమ్సన్ ను వేలానికి వదిలేయడంతో .. కెప్టెన్ స్థానం ఖాలీగా ఉందని చెప్పాలి.
కెప్టెన్ మరియు బ్యాట్స్మన్ గా ఒకరిని ఎంచుకోవాలి, అందుకు సరైన ప్లేయర్ గా ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇతని కోసం మరికొన్ని ఫ్రాంచైజీలు కూడా ప్రయత్నించే అవకాశం లేకపోలేదు. ఇక గతంలో రిస్ట్ స్పిన్నర్ గా అద్భుతమైన సేవలను అందించిన రషీద్ ఖాన్ గత సీజన్ లో జరిగిన వేలంలో కొత్తగా ఐపీఎల్ కు వచ్చిన గుజరాత్ టైటాన్స్ కు అమ్ముడుబోయిన సంగతి తెలిసిందే. అందుకే అతనిని రీప్లేస్ చేయడానికి వికెట్లు తీసే రిస్ట్ స్పిన్నర్ ను కొనుగోలు చేయడానికి ఆసక్తిగా ఉన్నారు. వారిలో ఇంగ్లాండ్ కు చెందిన అదిల్ రశీద్ కానీ, లేదా ఆస్ట్రేలియాకు చెందిన ఆడం జంపెను కానీ కొనుగోలు చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి.. వీరిద్దరిలో ఒకరిని కొనుగోలు చేయడానికి కోట్లను ఖర్చు చేయడానికి సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ సిద్ధంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: