రెండో టెస్ట్ కు ముందు.. బంగ్లాదేశ్ కు గట్టి ఎదురు దెబ్బ?

praveen
బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా అటు టీమ్ ఇండియాని వరుసగా గాయాల బెడద వేధిస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జట్టులో కీలక ఆటగాళ్లుగా కొనసాగుతున్న వారు గాయాల బారిన పడితే జట్టుకు దూరం అవుతూ ఉండడం అభిమానులందరినీ కూడా అయోమయంలో పడేస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే కేవలం భారత జట్టును మాత్రమే కాదు అటు ఆతిధ్య బంగ్లాదేశ్ జట్టును కూడా ఇలా గాయాల బెడద వేధిస్తూ ఉండడం గమనార్హం. ఇటీవల భారత్ బంగ్లాదేశ్ మధ్య జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో భారత జట్టు ఘన విజయాన్ని అందుకుంది.

 ఆతిథ్య బంగ్లాదేశ్ జట్టుకు ఎక్కడ అవకాశం ఇవ్వకుండా పూర్తి ఆధిపత్యాన్ని కనబరిచి చివరికి విజయం అందుకుంది. అయితే ఇక రెండోవ టెస్ట్ మ్యాచ్ లో భాగంగా బంగ్లాదేశ్ జట్టులో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న షకీబ్ అల్ హసన్ గాయం బారిన పడ్డాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అతను ఇక రెండవ టెస్టు మ్యాచ్లో అందుబాటులో ఉంటాడా లేదా అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఇప్పటికే మొదటి టెస్ట్ మ్యాచ్ ఓడిపోయి సిరీస్ సమం చేయాలంటే తప్పక విజయం సాధించాల్సిన రెండవ టెస్ట్ మ్యాచ్లో బంగ్లాదేశ్ కు ఊహించని గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది.

 జట్టులో స్టార్ ఆల్ రౌండర్ గా కీలక ప్లేయర్గా కొనసాగుతున్న షకీబ్ ఆల్ హసన్ గాయం కారణంగా ఇక తర్వాతి మ్యాచ్లో అందుబాటులో ఉండడం అనుమానమే అనేది తెలుస్తోంది. వన్డే సిరీస్ సందర్భంగా ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ లో గాయపడ్డాడు షకీబ్ అల్ హసన్. అయితే గాయం ఉన్నప్పటికీ కూడా లెక్క చేయకుండా మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. కానీ ఇక ఇప్పుడు అతని గాయం తీవ్రతరం కావడంతో ఇక రెండవ టెస్ట్ కి అతను అందుబాటులో ఉండడం అనుమానమే అన్నది తెలుస్తుంది.  షకీబ్ లాంటి కీలక ప్లేయర్ లేకుండా బంగ్లాదేశ్ ఎలా రానిస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: