ప్రెస్ మీట్ లో కొడుకు చేసిన పనికి.. తెగ నవ్వుకున్న ఫుట్ బాలర్?

praveen
ప్రస్తుతం కథార్ వేదికగా ప్రారంభమైన ఫిఫా వరల్డ్ కప్ చివరి దశకు చేరుకుంది అన్న విషయం తెలిసిందే. నేడు క్రీడా ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్న ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది అని చెప్పాలి. ఇక ఈ మ్యాచ్ లో భాగంగా ఎవరు విజేతగా నిలుస్తారు అన్నది కూడా ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఫైనల్ పోరుకు అడుగు దూరంలో ఓడిపోయి ఇక టోర్ని నుంచి నిష్క్రమించాయి మొరాకో, క్రోయేషియా జట్లు. ఈ క్రమంలోనే  రెండు జట్ల మధ్య మూడవ స్థానం కోసం పోటీ జరిగింది అన్న విషయం తెలిసిందే.

 ఇక ఈ పోరులో భాగంగా గత ప్రపంచ కప్ లో రన్నరప్ గా నిలిచిన క్రోయేషియా జట్టు ఇక మూడవ స్థానాన్ని దక్కించుకుంది. 2-1 తేడాతో మోరాకో పై విజయం సాధించింది అని చెప్పాలి. ఇటీవల కాలంలో ఫిఫా వరల్డ్ కప్ లో భాగంగా స్టార్ ప్లేయర్లు మీడియా సమావేశం నిర్వహించిన సమయంలో ఏకంగా తమ పిల్లలను కూడా  ఎత్తుకొని ఇక మీడియా ముందు మాట్లాడుతూ ఉండడం కనిపిస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇలా స్టార్ ప్లేయర్లు మాట్లాడుతుంటే వారి పిల్లలు మాత్రం చిలిపి చేష్టలతో  నవ్వులు పూయిస్తున్నారు.

 ఇక ఇప్పుడు ఇలాంటి తరహా ఘటనే జరగగా.. ఈ వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది. మొరాకో గోల్ కీపర్ యాసి  కుమారుడు చేసిన పనితో నేటిజన్స్ అందరు కూడా నవ్వుకుంటున్నారు. పోర్చుగల్ తో క్వార్టర్ ఫైనల్లో గెలిచిన అనంతరం యాసి బానౌ తన కుమారుడితో కలిసి ఇంటర్వ్యూ ఇచ్చేందుకు వచ్చాడు. అయితే ఇక రిపోర్టర్ అడిగిన ప్రశ్నలకు యాసి ఎంతో సీరియస్ గా మాట్లాడుతున్న సమయంలో ఇక అతని కొడుకు మాత్రం ఇక మైక్ ని ఏకంగా ఐస్ క్రీమ్ అనుకున్నాడు. దీంతో ఐస్ క్రీమ్ నాకడానికి వచ్చినట్లుగానే మైక్ ని తినడానికి ప్రయత్నించాడు. దీంతో కొడుకు చేసిన పనికి యాసీకి నవ్వు ఆగలేదు. ఈ వీడియో కాస్త వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: