ఐపీఎల్ వేలం 2023: ఆ ముగ్గురి డేంజరస్ ప్లేయర్స్ పై ఛాంపియన్ కన్ను !

VAMSI
ఇండియాలో ప్రతి సంవత్సరం జరిగే టీ 20 దేశవాళీ లీగ్ ఐపీఎల్ గురించి తెలిసిందే. ఇప్పటి వరకు ఐపీఎల్ లో 15 సీజన్ లు సక్సెస్ ఫుల్ గా పూర్తి అయ్యాయి. వచ్చే ఏడాది 16 వ సీజన్ లాంఛనంగా ప్రారంభం కానుంది. అయితే ఇందులో పాల్గొనే 10 జట్లు తమతో ఉన్న కొందరిని వేలానికి వదిలి మరికొందరిని తమతో అంటిపెట్టుకుంది. అలా వదిలేసిన ప్లేయర్ ల స్థానంలో మరికొందరిని కొనుగోలు చేసి పూర్తి జట్టును ఏర్పాటు చేసుకోవాలిసిన బాధ్యత ఆయా ప్రాంచైజీలకు ఉంది. అందులో భాగంగా గత సంవత్సరమే ఐపీఎల్ లోకి వచ్చిన గుజరాత్ టైటాన్స్ జట్టు... వాచీ రాగానే టైటిల్ ను కొట్టేసింది. ఈ టీం ను సీజన్ ఆసాంతం ఎంతో సక్సెస్ ఫుల్ గా విజయాల బాట పట్టించిన కెప్టెన్ గా హార్దిక్ పాండ్య మంచి పేరును తెచ్చుకున్నాడు.
కాగా ఈ నెల 23 వ తేదీన ఐపీఎల్ కు సంబంధించిన మినీ వేలం జరగనుంది.. ఈ వేలంలో అన్ని ఫ్రాంచైజీలు ఎవరిని కొనుగోలు చేయాలన్న విషయంపైన ఒక ప్లాన్ తో ఉన్నారు. అదే విధంగా .. గుజరాత్ టైటాన్స్ కూడా ముగ్గురు ప్లేయర్స్ ను కొనుగోలు చేయడానికి తెగ ఆసక్తిని చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వారిలో మాజీ పంజాబ్ కింగ్స్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ ఒక్కడు.. కెప్టెన్ గా ఉన్న సమయంలో ఆ ఒత్తిడి వలన బ్యాటింగ్ లో సరిగా రాణించలేకపోయాడు.. ఇప్పుడు ఒక ఇండివిడ్యుఅల్ ప్లేయర్ గా కొనుగోలు చేస్తే మయాంక్ ఓపెనర్ బ్యాట్స్మన్ గా జట్టుకు అవసరమైన పరుగులు చేయగలడు అని గుజరాత్ యాజమాన్యం భావిస్తోంది. ఇతను ఆడితే ఏ విధంగా ఉంటుంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఇక ఇంగ్లాండ్ కు చెందిన ఓపెనింగ్ బ్యాట్స్మన్ డేవిడ్ మలన్ ను కూడా సొంతం చేసుకోవడానికి ఉత్సాహాన్ని కనబరుస్తున్నారు. ఇతను టీ 20 లలో బెస్ట్ బ్యాట్సమన్ అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఇతని కనీస ధర ఒకటిన్నర కోటిగా ఉంది.. మరి ఏ ఏ జట్లు ఇతనికోసం పోటీ పడతాయన్నది చూడాలి. గత కొంతకాలంగా టీ 20 లలో అద్భుతంగా రాణిస్తున్న బౌలర్ల లలో ఐర్లాండ్ కు చెందిన లెఫ్ట్ ఆర్మ్ పేసర్ జాషువా లిటిల్ కూడా ఉన్నాడు. ఇతని కనీస ధర లక్షలుగా ఉంది కాబట్టి తక్కువ ధరకు ఇతనిని సొంతం చేసుకుంటే బాగా ఉపయోగపడుతాడని గుజరాత్ టైటాన్స్ భావిస్తోంది. మరి ఈ ముగ్గురు ఆటగాళ్లను గుజరాత్ దక్కించుకుని రెండవ సారి టైటిల్ ను పొందుతుందా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: