అతను టీం ఇండియాకు ఒక ఆయుధం : దినేష్ కార్తీక్

praveen
గత కొంతకాలం  పేలవమైన ఫామ్ కారణంగా నుంచి జట్టుకు దూరమయ్యాడు కుల్దీప్ యాదవ్. జట్టులో అవకాశం కోసం ఎంతలా ఎదురుచూసినప్పటికీ వరుసగా అతనికి నిరాశ ఎదురవుతూ వచ్చింది అన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ వెనకడుగు వేయకుండా పట్టుదలతో ముందుకు సాగాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం బంగ్లాదేశ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భాగంగా కుల్దీప్ యాదవ్ మళ్ళీ టీమిండియాలోకి వచ్చేసాడు అన్న విషయం తెలిసిందే.

 ఈ క్రమంలోనే కుల్దీప్ యాదవ్ ప్రదర్శన ఎలా ఉంటుంది అనేదానిపై ఎంత మంది భారత అభిమానులు కూడా ఎదురు చూశారు. అయితే ఇక ఇటీవల బంగ్లాదేశ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో మాత్రం అంచనాలకు మించి రాణిస్తూ ఉన్నాడు ఈ చైనా మాన్ బౌలర్. ఏకంగా తన ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇకపోతే తన స్పిన్ బౌలింగ్ తో మాయ చేసి కీలకమైన సమయంలో వికెట్లు పడగొట్టడంపై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు స్పందిస్తూ ప్రస్తుతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇక కుల్దీప్ యాదవ్ అద్భుతమైన ప్రదర్శన పై స్పందించిన టీమిండియా సీనియర్ బ్యాట్స్మెన్ దినేష్ కార్తీక్ సైతం పొగడ్తల వర్షం కురిపించాడు అని చెప్పాలి.

 కుల్దీప్ యాదవ్ బౌలింగ్ అద్భుతం అంటూ కొనియాడాడు దినేష్ కార్తీక్. ముఖ్యంగా షకీబ్ అల్ హసన్ ను అవుట్ చేసిన తీరు తనను ఎంతగానో కట్టిపడేసింది అంటూ దినేష్ కార్తీక్ కుల్దీప్ యాదవ్ ను ఆకాశానికి ఎత్తేసాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్ చేసినంత సేపు కూడా అటు బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్లు ఎంతగానో ఇబ్బంది పడ్డారని.. పరుగులు చేయడానికి కాదు వికెట్ కాపాడుకోవడానికి ప్రయత్నించారు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక రానున్న రోజుల్లో కుల్దీప్ యాదవ్ తన బౌలింగ్ తో టీమ్ ఇండియాకు ఒక మంచి ఆయుధంగా మారిపోవడం ఖాయం అంటూ అభిప్రాయపడ్డాడు దినేష్ కార్తీక్. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ పోరులో ఉండాలి అంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో టీమిండియా అద్భుతమైన ప్రదర్శన చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: