వారెవ్వా.. కెప్టెన్ హార్మన్ ప్రీత్ కౌర్.. వరల్డ్ రికార్డ్?

praveen
ప్రస్తుతం టీమిండియా మహిళలు జట్టుకు కెప్టెన్ గా కొనసాగుతుంది హార్మన్ ప్రీత్ కౌర్. మిథాలీ రాజ్ నుంచి సారధ్య బాధ్యతలు అందుకున్న తర్వాత ఎంతో సమర్థవంతంగా జట్టును ముందుకు నడిపిస్తుంది అని చెప్పాలి. తన కెప్టెన్సీ వ్యూహాలతో ప్రత్యర్థులను  దెబ్బకొడుతూ ఎప్పుడు టీమిండియాకు అరుదైన విజయాలు అందిస్తూ ఉంది అని చెప్పాలి. ఇక అటు హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీ చేపట్టిన తర్వాత టీమ్ ఇండియా ఉమెన్స్ జట్టు ఆట తీరులో కూడా ఎంతగానో మార్పు వచ్చింది. ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం ప్లేయర్లు ఎంతో దూకుడుగా ఆడుతున్నారు అని చెప్పాలి.

 ఇలా జట్టులో సీనియర్ ప్లేయర్గా ఒకవైపు కెప్టెన్ గా కొనసాగుతున్న హార్మన్ ప్రీత్ కౌర్ ప్రతి విషయాన్ని కూడా బాగా అర్థం చేసుకుంటూ ఎంతోమంది ప్లేయర్లకు మద్దతుగా నిలుస్తూ మంచి ప్రదర్శన చేసేలా ప్రోత్సహిస్తూ ఉంటుంది అని చెప్పాలి. ఇకపోతే ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనకు రాగ భారత జట్టు టి20 సిరీస్ ఆడుతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవల ఆస్ట్రేలియాతో  జరిగిన మూడో టి20 మ్యాచ్ లో భాగంగా ఒక అరుదైన రికార్డును సృష్టించింది టీమిండియా మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్.

 టి20 ఫార్మాట్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన మహిళా క్రికెటర్ గా నిలిచింది అని చెప్పాలి. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో భాగంగా భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఏకంగా టి20 ఫార్మాట్లో 140 మ్యాచ్లను పూర్తి చేసుకుంది. ఇక ఇందులో  27.36 సగటు 2,736 పరుగులు చేసింది. టి20 ఫార్మాట్లో హార్మన్ ప్రీత్ కౌర్ అత్యుత్తమ స్కోరు 103 పరుగులు కావడం గమనార్హం. అంతేకాదు ఇక హర్మన్ టి20 కెరియర్ లో 8 అర్ధ శతకాలు కూడా ఉన్నాయి.

 హార్మన్ ప్రీత్ కౌర్ తర్వాతి స్థానంలో 139 టి20 మ్యాచ్ లు ఆడిన ప్లేయర్గా న్యూజిలాండ్ ప్లేయర్ సుజీ రెండవ స్థానాల్లో కొనసాగుతుంది అని చెప్పాలి. ఇంగ్లాండుకు చెందిన డేన్ని వాట్ 136 మ్యాచ్లతో మూడవ స్థానంలో ఉంది.  ఇక ఆ తర్వాత ఆస్ట్రేలియా ప్లేయర్ అలిస్సా హెలి  135 మ్యాచ్లు, ఎలీస్ పెర్రి 129 మ్యాచ్లో వరసగా నాలుగు ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు.. అయితే ఇటీవల జరిగిన మ్యాచ్లో మూడో టి20 లో టీమిండియా ఓడిపోయింది అన్న విషయం తెలిసిందే..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: