ఐసీసీ టి20 వరల్డ్ కప్.. సరికొత్త రికార్డ్?

praveen
ఆస్ట్రేలియా వేదికగా ఏడాది అక్టోబర్ 16వ తేదీన ప్రారంభమైన టి20 వరల్డ్ కప్ ఇక ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరినీ కూడా ఎంత అలరించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మెగా టోర్నీలో చివరికి ఇక ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ ను ఓడించిన ఇంగ్లాండ్ జట్టు విశ్వవిజేతగా నిలిచింది. ఈ క్రమంలోనే  ఇంగ్లాండ్ జట్టు రెండవసారి ఇక టి20 వరల్డ్ కప్ అందుకుంది అన్న విషయం తెలిసిందే.

 అయితే టి20 ప్రపంచ కప్ లో భాగంగా ఇక ఎన్నో జట్లకు సంబంధించిన ఆటగాళ్లు తమ అద్భుతమైన ప్రదర్శనతో ఎన్నో అరుదైన రికార్డులు కూడా సృష్టించారు. మరి కొంత మంది ఇతరులు సాధించిన రికార్డులను కూడా బ్రేక్ చేసి ఇక సరికొత్త చరిత్రకు నాంది పలికారు అని చెప్పాలి. అయితే కేవలం వరల్డ్ కప్ లో ఆడిన ఆటగాళ్లు మాత్రమే కాదు ఏకంగా టి20 వరల్డ్ కప్ సైతం నేను రికార్డులు సృష్టిస్తుంది అన్న విషయాన్ని ఇక ఇటీవల ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ఈ విషయం తెలిసి క్రికెట్ ప్రేక్షకులు బాగా ఎక్సైట్ అవుతున్నారు.

 ఇక ఇటీవల ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కొన్ని ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంది అని చెప్పాలి. ఐసీసీ చెప్పిన వివరాల ప్రకారం.. ఐసీసీ ఫ్లాట్ ఫారంలలో డిజిటల్ లో మొత్తం 6.6 బిలియన్ వీక్షణలు.. ఇక బ్రాడ్ కాస్ట్ లో 3.95 బిలియన్ వీక్షణలు వచ్చినట్లు ప్రకటించింది అంటే టి20 వరల్డ్ కప్ 2021 తో పోల్చి చూస్తే 65% వీక్షణలు పెరిగినట్లు తెలుస్తుంది. కాగా ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లోనే ఇది ఆల్ టైం రికార్డ్ అంటూ అటు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తెలిపింది అని చెప్పాలి. కాగా ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ లో భారత జట్టు భారీ అంచనాల మధ్య బరిలోకి దిగి సెమీఫైనల్ లోనే ఇంటి బాట పట్టింది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: