మొన్నే డబుల్ సెంచరీ.. 5 రోజుల వ్యవదిలోనే మరో విధ్వంసం?

praveen
మొన్నటికి మొన్న రోహిత్ శర్మ గాయపడడంతో అదృష్టం కలిసి వచ్చి టీమ్ ఇండియాలోకి వచ్చిన ఇషాన్ కిషన్ తనకు దక్కిన అవకాశాన్ని ఎంతలా సద్వినియోగం చేసుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటి లాగానే సాదాసీదా  ప్రదర్శన చేస్తాడు అని అందరూ అనుకున్నప్పటికీ ఊహించని రీతిలో అదిరిపోయే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు అని చెప్పాలి. ఏకంగా 126 బంతుల్లోనే 200 పరుగులు చేసి ఎన్నో రికార్డులను కూడా కొల్లగొట్టాడు. ఇక ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ లో 24 ఫోర్లు 10 సిక్సర్లు  ఉన్నాయి అంటే అతను బౌలర్లపై ఎంతలా విరుచుకుపడ్డాడు అర్థం చేసుకోవచ్చు.

 భవిష్యత్తులో టీమిండియా ఆడబోయే ప్రతి వన్డే మ్యాచ్లో కూడా అతని తప్పక ఎంపిక చేయాలి అనే ఒత్తిడిని సెలెక్టర్లపై తీసుకువచ్చాడు అని చెప్పాలి. అయితే ప్రస్తుతం వన్డే సిరీస్ ముగిసిన నేపథ్యంలో బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ ఆడుతుంది టీమ్ ఇండియా.  ఇకపోతే ఇక టెస్ట్ సిరీస్లో ఎంపిక కాని ఇషాన్ కిషన్ ప్రస్తుతం రంజీ ట్రోఫీలో భాగంగా ఆడుతున్నాడు. ఇకపోతే ఇటీవల కేరళతో జరిగిన మ్యాచ్లో మరోసారి తన ప్రదర్శనతో అద్భుతం చేశాడు ఇశాన్ కిషన్ అని చెప్పాలి. ఏకంగా సెంచరీ తో విధ్వంసం సృష్టించాడు. ఇలా రోజుల వ్యవధి లోనే ఇషాన్ కిషన్ ఒక డబుల్ సెంచరీతో పాటు మరో సెంచరీ చేయడంతో అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.

 ఆట మూడో రోజు బరిలోకి దిగిన ఇషాన్ కిషన్ 195 బంతుల్లో 9 ఫోన్లు 8 సిక్సర్లతో మెరుపు ఇన్నింగ్స్ ఆడి సెంచరీ చేశాడు. ఇక మరో ఎండ్ లో ఉన్న సౌరబ్ తివారి  97 పరుగులు చేసి మంచి తోడ్పాటు అందించాడు అని చెప్పాలి. అయితే జార్ఖండ్ తొలి ఇన్నింగ్స్ సమయంలో 340 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అంతకు ముందు అక్షయ్ చంద్ర 150 పరుగులు చేసి భారీ సెంచరీ తో చెలరేగడంతో ఇక తొలి ఇన్నింగ్స్ ముగిసిన సమయానికి 475 పరుగుల భారీ స్కోరు చేసింది జార్ఖండ్ జట్టు. ఏది ఏమైనా ఇషాన్ కిషన్ ఇలా రోజులు వ్యవధిలోనే సెంచరీతో చెలరేగి పోవడం   మాత్రం ప్రస్తుతం భారత క్రికెట్లో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: