రూల్స్ బ్రేక్ చేసిన టీమిండియా.. ఇది గమనించారా?

praveen
క్రికెట్లో టెస్ట్ ఫార్మాట్ తో పాటు వన్డే టి20 ఫార్మాట్లు ఉంటాయి. అయితే వన్డే, టి20 ఫార్మాట్లకు ఆయా దేశాల జట్లు ఇక ప్రత్యేకమైన రంగుతో కూడిన జెర్సీ ధరించడం లాంటివి చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే టీమిండియా నీలిరంగు జెర్సీ ధరిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే టెస్ట్ ఫార్మాట్ విషయానికి వచ్చేసరికి మాత్రం ఇక ఏ దేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ ఆటగాళ్లు అందరూ కూడా తెలుపు రంగు జెర్సీ ధరించాల్సి ఉంటుంది అని చెప్పాలి. ఇక ఐసీసీ రూల్స్ ప్రకారం ఏ జట్టు కూడా ఈ నిబంధనలను అతిక్రమించడానికి వీలులేదు.

 కానీ ఇటీవల బంగ్లాదేశ్ తో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో మాత్రం అటు భారత జట్టు తెలుపు రంగు జెర్సీ విషయంలో ఐసీసీ రూల్స్ ను బ్రేక్ చేసింది అనేది తెలుస్తుంది. సాధారణంగా టెస్టుల్లో ఎప్పుడూ వాడే తెల్ల జెర్సీతో కాకుండా టీమిండియా బంగ్లాదేశ్ తో జరిగిన తొలి మ్యాచ్లో సగం ముదురు గోధుమ రంగు జెర్సీతో బరిలోకి దిగింది అని చెప్పాలి.  ఇలా టెస్ట్ సిరీస్ లో వైట్ జెర్సీ ధరించాలి అన్న ఐసీసీ రూల్ను బ్రేక్ చేసింది.  అయితే మ్యాచ్ ప్రారంభమైన కాసేపటికి భారత అభిమానులు ఈ విషయాన్ని గుర్తించి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

 అయితే బీసీసీఐ జెర్సీ రంగును ఎందుకు మార్చింది అనే విషయంపై క్లారిటీ లేదు అని చెప్పాలి. కానీ టీమిండియా ఫ్యాన్స్ మాత్రం టీమిండియాను మళ్లీ పాత వైట్ జెర్సీలోనే చూడాలని ఉందని... ఇక ఇలా రంగు మారిస్తే మిగతా జట్లకు మనకు తేడా కనిపిస్తుందనికామెంట్లు చేస్తున్నారు. కొత్త జెర్సీ స్థానంలో పాత రంగునే తిరిగి తేవాలి అంటూ డిమాండ్ చేస్తూ ఉండటం గమనార్హం. అయితే ఇలా జెర్సీ సగం గోధుమ రంగులోకి మార్చడానికి వెనుక కారణం ఏంటి అన్నది బీసీసీఐ చెబుతుందా లేదా అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: