ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ.. ఇరకాటంలో కోచ్ ద్రావిడ్?

praveen
అడపదడప అవకాశాలు అందుకుంటున్న.. వచ్చిన అవకాశాన్ని ఒడిసి పట్టుకుని అద్భుతమైన ప్రదర్శనతో తన సత్తా ఏంటో చూపిస్తూ వస్తున్నాడు ఇషాన్ కిషన్.  ఇప్పటికే ఐపీఎల్ లో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్గా కొనసాగుతున్న ఇషాన్ కిషన్ కు అటు టీమిండియాలో మాత్రం అవకాశాలు దక్కింది చాలా తక్కువే అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన మూడో వన్డే సిరీస్ లో భాగంగా అనూహ్యంగా జట్టులోకి వచ్చిన ఇషాన్ కిషన్ ఇక తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఏకంగా సిక్సర్లు ఫోర్ లతో చెలరేగిపోయి  126 బంతుల్లోనే డబుల్ సెంచరీ స్కోర్ చేశాడు.

 ఇలా తర్వాత మ్యాచ్లలో సెలెక్టర్లు తనను పక్కన పెట్టకుండా ఇక తన ఆట తీరుతోనే అందరి దృష్టిని ఆకర్షించాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇషాన్ కిషన్ అద్భుతమైన ప్రదర్శన చేసిన నేపథ్యంలో ఇక ప్రస్తుతం టీమిండియాలో కొంతమంది సీనియర్ ఆటగాళ్ల కెరియర్ ప్రమాదంలో పడిపోయింది అన్న విమర్శలు కూడా వస్తున్నాయని చెప్పాలి. ఇకపోతే కోచ్ రాహుల్ ద్రావిడ్ ను ఉద్దేశిస్తూ ఎంతోమంది భారత క్రికెట్ అభిమానులు కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు.

 ఏకంగా అద్భుతమైన కోచ్ అంటూ రాహుల్ ద్రావిడ్ ను టీమ్ ఇండియా నియమించుకుంటే.. అతను మాత్రం సరైన ప్రతిభగల ప్లేయర్లను ఎంపిక చేయడంలో విఫలం అవుతున్నాడు అంటూ ఎంతో మంది విమర్శలు గుప్పిస్తున్నారు. ఏకంగా మాజీ ఆటగాళ్లు సైతం ఇదే విషయంపై స్పందిస్తూ పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ఎందుకో టీమ్ ఇండియాలో దూకుడుగా ఆడే ఆట తీరు కనిపించడం లేదు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. కాగా గత కొంతకాలం నుంచి భారత జట్టులో విపరీతమైన ప్రయోగాలు చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే.

 ముఖ్యంగా ఓపెనర్లుగా ప్రస్తుతం ముగ్గురు కొనసాగుతున్నారు. ఒకవైపు టి20 లలో కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ ఉండగా అటు వన్ డే ఫార్మాట్లో  మాత్రం శిఖర్ ధావన్, రోహిత్ ఓపెనర్లుగా కొనసాగుతున్నారు. అయితే ఇక ఇద్దరు కూడా పెద్దగా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయడం లేదు. ఇలాంటి సమయంలో అటు పేలవ  ప్రదర్శన చేస్తున్న వారికి వరుసగా అవకాశాలు ఇస్తున్నారు. కానీ ఇక ప్రతిభ దాగి ఉండి మంచి ఫామ్ లో ఉన్న ఇషాన్ కిషన్ లాంటి వారికి మాత్రం మంచి అవకాశాలు రావడం లేదు. దీంతో కోచ్ రాహుల్ ద్రావిడ్ నూ ఉద్దేశిస్తూ భారత క్రికెట్ అభిమానులు పెడుతున్న పోస్టులు మాత్రం వైరల్ గా మారిపోయాయి. ఇలా ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ రాహుల్ ద్రావిడ్ నూ ఇరకాటంలో  పడేసింది అనేది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: