అప్పుడు ధోని.. ఇప్పుడు రోనాల్డో.. జెర్సీ నెంబర్ 7 కలిసి రాదా?

praveen
ఇటీవల ఫిఫా వరల్డ్ కప్ లో భాగంగా ఏకంగా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన పోర్చుగల్ జట్టు ఊహించిన రీతిలో టోర్నీ నుంచి నిష్క్రమించింది అన్న విషయం తెలిసిందే. క్వార్టర్స్  లో జరిగిన మ్యాచ్ లో మొరాకో చేతిలో ఓడిపోయిన పోర్చుగల్ జట్టు టైటిల్ గెలవాలని కల సాకారం చేసుకోలేకపోయింది. అయితే ఇక పోర్చుగల్ జట్టు కెప్టెన్ గా కొనసాగుతున్న స్టార్ ఫుట్ బాల్ ప్లేయర్ క్రిస్టియానో రోనాల్డో ఓటమితో కన్నీళ్లు పెట్టుకున్నాడు.

 ఇక పోర్చుగల్ ఓటమి గురించి చర్చ జరుగుతూ ఉండగా ఆ జట్టు కెప్టెన్ రోనాల్డో జెర్సీ నెంబర్ సెవెన్ గురించి కూడా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోని జెర్సీ నెంబర్ సెవెన్ లెజెండరీ ఆటగాళ్లకు అసలు కలిసి రావడం లేదంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అయితే క్రీడా అభిమానులు ఇలా కామెంట్ చేయడానికి వెనుక పెద్ద కారణమే ఉంది. 2019 సంవత్సరం వన్డే ప్రపంచ కప్ సమయంలో న్యూజిలాండ్తో జరిగిన సెమీఫైనల్ లో భారత్ ఓడిపోయింది. చివరికి ప్రపంచకప్ నుండి నిష్క్రమించింది అయితే  ఇక మహేంద్ర సింగ్ ధోనీకి అదే చివరి వరల్డ్ కప్ కావడం గమనార్హం.

 ధోని జెర్సీ నెంబర్ కూడా సెవెన్ కావడం గమనార్హం. ఇలా తమ  తమ కెరియర్లో ఆడుతున్న చివరి ప్రపంచ కప్ లో వరల్డ్ కప్ అందించాలని ఎంతలా పోరాడినప్పటికీ ధోని కి సాధ్యం కాలేదు. ఇక ఇప్పుడు ఇక 35 ఏళ్ల క్రిష్టియన్ రోనాల్డో తన చివరి వరల్డ్ కప్ ఆడుతుండగా పోర్చుగల్ జట్టుకు ప్రపంచకప్ అందించాలనే కల నెరవేరకుండానే వెనుతిరిగాడు. దీంతో జెర్సీ నెంబర్ సెవెన్ ఆటగాళ్లకు నిరాశన మిగిల్చింది అంటూ ఎంతో మంది క్రీడాభిమానులు కామెంట్ చేస్తున్నారు. జెర్సీ నెంబర్ సెవెన్ తో జాగ్రత్తగా ఉండాలి అంటూ కొంతమంది ట్విట్టర్ వేదికగా పోస్టులు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: