క్రికెట్.. ఒక్క ఛాన్స్ ఇవ్వు.. ట్రిపుల్ సెంచరీ వీరుడు భావోద్వేగం?

praveen
ఇటీవల కాలంలో ఎంతోమంది యువ  ఆటగాళ్లు భారత జట్టులో కనిపిస్తూ ఉన్నారని విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక టీమ్ ఇండియాలో వచ్చిన అవకాశాన్ని ఎంతగానో సద్వినియోగం చూసుకుంటున్నారు. మరి కొంతమంది మాత్రం పేలవమైన   ప్రదర్శన చేసి కనుమరుగు అవుతున్నారు అని చెప్పాలి. అయితే ఇలా టీమిండియాలోకి అరంగేట్రం చేసిన ఆటగాళ్లు ఎవరైనా సరే డెబ్యు మ్యాచ్ లోనే ఏకంగా త్రిబుల్ సెంచరీ సాధించి సరికొత్త చరిత్ర సృష్టిస్తే.. ఇక అతనికి తిరుగు ఉండదు అని చెప్పాలి. టీమిండియాలో అతను తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నట్లే అవుతుంది.

 కానీ ఇలా డెబ్యు మ్యాచ్ లోనే త్రిబుల్ సెన్సరీ చేసిన వీరుడు ఇక ఇప్పుడు టీమిండియాలో అవకాశం కోసం నిరీక్షణగా ఎదురు చూస్తూ ఉన్నాడు. దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన చేస్తున్న ఎందుకో సెలెక్టర్లు మాత్రం టీమిండియా జట్టు ఎంపిక సమయంలో అతని వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు అని చెప్పాలి. సరిగా ఆరేళ్ల క్రితం భారత టెస్టు క్రికెట్లోకి అరంగేట్రం చేసిన యువ సంచలనం కరుణ్ నాయర్ అరంగేట్రం టెస్టు సిరీస్ లోనే త్రిబుల్ సెంచరీ సాధించాడు. ఇలా భారత క్రికెట్ చరిత్రలో వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత టెస్టుల్లో త్రిబుల్ సెంచరీ చేసిన బ్యాట్స్మెన్ గా రికార్డు సృష్టించాడు.

 ఇలా అరంగేట్రంలోని చరిత్ర సృష్టించిన అతడిని కేవలం 5 నెలలకే పక్కన పెట్టేసింది బీసీసీఐ. ఇక ఇప్పుడు కరున్ నాయర్  అనే క్రికెటర్ భారత క్రికెట్ లో ఉన్నాడు అన్న విషయాన్ని కూడా భారత సెలక్టర్లు మరిచిపోయారేమో అని అనిపిస్తూ ఉంటుంది. దేశవాళీ క్రికెట్లో బాగా రాణిస్తున్నప్పటికీ భారత జట్టు నుంచి మాత్రం పిలుపు అందుకోలేకపోతున్నాడు.. ఇక త్వరలో జరగబోతున్న రంజీ ట్రోఫీకి కర్ణాటక జట్టులో కరణ్ నాయక్ కు చోటు దక్కలేదు. దీంతో అతను తీవ్ర నిరాశలో మునిగిపోయాడు అని చెప్పాలి. ఇక భావోద్వేగంతో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. డియర్ క్రికెట్.. నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. దీంతో అభిమానులు స్పందిస్తూ నీలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళని చాలా మందిని తొక్కేశారు అంటూ కామెంట్లు చేస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: