ఇషాన్ కిషన్ (210 పరుగులు) దెబ్బకు బెంబేలెత్తిన బంగ్లా బౌలర్లు !

VAMSI
ఈ రోజు ఇండియా మరియు బంగ్లాదేశ్ ల మధ్యన ఆఖరి వన్ డే చట్టోగ్రామ్ స్టేడియం లో జరుగుతున్న సంగతి తెలిసిందే. మొదట టాస్ గెలిచిన బంగ్లా కెప్టెన్ లిటన్ దాస్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అయితే రెండు మ్యాచ్ లలో లిటన్ దాస్ తీసుకున్న నిర్ణయాలు వారిని విజేతలుగా నిలిపాయి. రోహిత్ స్థానంలో జట్టులో ఇషాన్ కిషన్ చోటు దక్కించుకున్నాడు. అలా ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ఇండియాకు మరోసారి శిఖర్ ధావన్ (3) చెత్త ఆరంభాన్ని ఇచ్చాడు. మొదటి వికెట్ ను 15 పరుగుల వద్ద కోల్పోయి మళ్ళీ గత రెండు వన్ డే ల మాదిరి అవుతుందని అంతా భావించారు. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ కింగ్ కోహ్లీతో కలిసి ఇన్నింగ్స్ ను నెమ్మదిగా చక్కదిద్దే బాధ్యతను తీసుకున్నాడు.
మరో వికెట్ పడకుండా వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదాడు. కోహ్లీ మాత్రం దాదాపుగా ఇషాన్ కే స్ట్రైకింగ్ ఇస్తూ సింగిల్స్ కే పరిమితం అయ్యాడు. అలా ఇషాన్ కిషన్ స్వేచ్ఛగా గ్రౌండ్ కు నాలుగు వైపులా బౌండరీలు కొడుతూ భారత అభిమానుల ఆనందానికి కారణం అయ్యాడు. మూడు వన్ డే ల సిరీస్ లో స్క్వాడ్ లో ఉన్న చోటు దక్కించుకొని ఇషాన్.. రోహిత్ గాయం కారణంగా తప్పుకోవడం కలిసొచ్చింది.. ఇదే అదునుగా భావించి బంగ్లా బౌలర్లను ఒక అతడుకున్నాడు. ఎవ్వరినీ వదిలిపెట్టకుండా అబ్బురపరిచే షాట్ లతో విరుచుకుపడ్డాడు. ఇప్పటి వరకు ఇషాన్ కెరీర్ లో 10 వన్ డే లు ఆడగా, సెంచరీ సాధించింది లేదు.
ఈ మ్యాచ్ తో ఆ కొరత కూడా తీరిపోయింది, ఇషాన్ కిషన్ తన ఇన్నింగ్స్ లో కేవలం 131 బంతుల్లో 210 పరుగులు చేసి రికార్డును సాధించాడు. ఇదే అతనికి మొదటి సెంచరీ మరియు డబుల్ సెంచరీ కావడం విశేషం. ఇషాన్ కిషన్ మొత్తం 24 ఫోర్లు మరియు 10 సిక్సులు కొట్టి తన సత్తా ఏమిటో మరోసారి ప్రపంచానికి తెలియచేశాడు. కేవలం బౌండరీల సాయంతో 156 పరుగులు సాధించాడు. ఇక ఇహాని జతలో కోహ్లీ సైతం కెరీర్ లో 44 వ సెంచరీ ని సాధించాడు. మూడు సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత వన్ డే లలో సెంచరీ సాధించి అభిమానుల ఆశలను తీర్చాడు. ఇండియా చివరికి నిర్ణీత ఓవర్ లలో 8 వికెట్ల నష్టానికి 409 పరుగులు చేసింది.  

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: