ఆస్ట్రేలియా బ్యాటర్ అరుదైన రికార్డ్.. వరల్డ్ క్రికెట్లో రెండో ప్లేయర్గా?

praveen
గత కొంతకాలం నుంచి కెరియర్ లోనే అత్యుత్తమమైన ఫామ్ లో కొనసాగిస్తూ పరుగుల వరద పారిస్తున్న ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మెన్ మార్నస్ లబుషేణ్.. ఇక టెస్ట్ క్రికెట్లో సరికొత్త ప్రభంజనం సృష్టిస్తూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అతను ఆడిన ప్రతి మ్యాచ్లో కూడా సెంచరీ చేయడమే లక్ష్యంగా పెట్టుకొని బౌలర్ల పై వీర విహారం చేస్తూ ఉన్నాడు అని చెప్పాలి. సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోతూ.. ఇక తన బ్యాటింగ్తో సృష్టిస్తున్న విధ్వంసం ప్రపంచ క్రికెట్లో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇలా గత కొంతకాలం నుంచి పరుగుల వరద పారిస్తూ అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్న ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మెన్ మార్నస్ లబుషేణ్ ఇటీవల ఐసీసీ విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు.

 అంతేకాదు తన పరుగుల ప్రవాహంతో ఎన్నో అరుదైన రికార్డులను సైతం కొల్లగొడుతున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటికే సెంచరీలతో చెలరేగిపోతున్న మార్నస్ లబుషేణ్ టెస్ట్ ఫార్మాట్లో ఇటీవల మరో అరుదైన ఘనత సాధించాడు అని చెప్పాలి. అత్యంత వేగంగా టెస్ట్ ఫార్మాట్ లో 3000 పరుగులు చేసిన బ్యాట్స్మెన్ గా అరుదైన ఘనత అందుకున్న రెండో బ్యాటర్ గా మార్నస్ లబుషేణ్ రికార్డులు సృష్టించాడు.. ఇక వెస్టిండీస్ దిగ్గజం ఎవర్టన్ వీక్స్ సరసన మార్నస్ లబుషేణ్ నిలిచాడు అని చెప్పాలి. మార్నస్ లబుషేణ్ 51 ఇన్నింగ్స్ లో మూడు వేల పరుగుల మైలు రాయిని అందుకోగా.  ఇక వెస్టిండీస్ మాజీ ప్లేయర్ ఎవర్టన్ వీక్స్ ఇక ఈ మైల్ స్టోన్ ను 51 ఇన్నింగ్స్ లోనే చేరాడు అని చెప్పాలి.

 ఇకపోతే ఇటీవల వెస్టిండీస్ తో రెండో టెస్టు సందర్భంగా తొలి ఇన్నింగ్స్ లోనే 163 చేసి అదరగొట్టాడు లభూషేణ్.  ఇక తద్వారా ఈ ఘనత సాధించాడు అని చెప్పాలి   అయితే ఈ రికార్డు సాధించిన వారిలో తొలి స్థానంలో ఆస్ట్రేలియా దిగ్గజం బ్రాడ్మన్ ఉన్నాడు. కాగా బ్రాడ్ మాన్ కేవలం 33 ఇన్నింగ్స్ లోనే 3 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు అని చెప్పాలి. ఇక మార్నస్ లబుషేణ్ అరుదైన మైలురాయిని అందుకోవడం పై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు అని చెప్పాలి. ఇక అతని ప్రదర్శన పై మాజీలు ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: