ఇండియా తుది జట్టులో మార్పులు... పరువు కోసం చివరి ప్రయత్నం !

VAMSI
ఇండియా క్రికెట్ టీం ప్రస్తుతం ఆసియా దేశం అయిన బంగ్లాదేశ్ పర్యటనలో మూడు వన్ డే లు మరియు రెండు టెస్ట్ మ్యాచ్ లు ఆడేందుకు వెళ్లిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా డిసెంబర్ 4 మరియు డిసెంబర్ 7 వ తేదీల్లో జరిగిన మొదటి, రెండవ వన్ డే లలో అంచనాలు తారుమారై రోహిత్ సారధ్యంలోని ఇండియా జట్టు ఓటమి పాలై సిరీస్ ను చేజార్చుకుంది. బంగ్లాదేశ్ అన్ని విభాగాలలో స్పతమైన ఆధిక్యాన్ని కనబరిచి సిరీస్ ను గెలుచుకుంది. ముఖ్యంగా బౌలింగ్ లో ఇండియా కన్నా మించి రాణిస్తుండడం వారి గెలుపు అవకాశాలను మరింత సులభం చేసింది అని చెప్పాలి. రెండవ వన్ డే లో ఫీల్డింగ్ సమయంలో స్లిప్ లో క్యాచ్ ను అందుకుంటూ రోహిత్ చేతి వేలికి గాయం కావడం కూడా ఇండియా ఓటమిని దెబ్బ తీసింది.
అయినా రోహిత్ జట్టును గెలుపు ముంగిట వరకు తీసుకెళ్లి బంగ్లా మ్యాచ్ గెలుచుకున్నప్పటికీ , రోహిత్ మాత్రం అభిమానుల మనసును గెలుచుకున్నాడు. ఇక మూడవ వన్ డే కు ముందే గాయం కారణంగా రోహిత్ శర్మ , కుల్దీప్ సేన్ మరియు దీపక్ చాహర్ లు తప్పుకోవడం పెద్ద దెబ్బ అని చెప్పాలి. రోహిత్ అయితే టెస్ట్ సిరీస్ కు అందుబాటులో ఉంటాడా లేదా అన్నది సందేహమే అని ఇండియా యాజమాన్యం చెబుతోంది. మూడవ వన్ డే కు తుది జట్టులో కీలక మార్పులు జరిగే అవకాశం ఉంది. గత మ్యాచ్ లో సిరాజ్ మొదటి స్పెల్ బాగా వేసినప్పటికీ చివర్లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. ఉమ్రాన్ మాలిక్ సైతం ఆఖరి ఓవర్ లలో పరుగులు నియంత్రించడంలో ఫెయిల్ అయ్యాడు.
అందుకే బౌలింగ్ విభాగంలో కుల్దీప్ సేన్ మరియు దీపక్ చాహర్ లు అందుబాటులో లేనందున శహబాజ్ అహ్మద్ ను తీసుకుని శార్దూల్, ఉమ్రాన్ మరియు సిరాజ్ లను అలాగే కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా బ్యాటింగ్ లోనూ మార్పులు జరిగే ఛాన్స్ లు కొట్టిపారెయ్యలేము. రోహిత్ శర్మ స్థానంలో రజత్ పాటిదార్ మరియు రాహుల్ త్రిపాఠి లలో ఒకరికి ఛాన్స్ దక్కవచ్చు. ఇక సీనియారిటీ ప్రకారం చూస్తే మాత్రం రాహుల్ త్రిపాఠికి అవకాశం దక్కవచ్చని క్రికెట్ ప్రముఖులు భావిస్తున్నారు. మరి రేపు పరువుకు ఆడే చివరి వన్ డే లో జట్టులో ఎటువంటి మార్పులు ఉండనున్నాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: