వావ్.. క్రికెట్లో అతను నెంబర్ 1 గా మారాడు?

praveen
ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో టెస్ట్ ఫార్మాట్ తో పాటు టి20, వన్డే ఫార్మాట్ లు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొంతమంది ఆటగాళ్లు మాత్రమే ఈ మూడు ఫార్మట్ల లో కోన సాగుతూ తమదైన శైలిలో సత్తా చాటుతూ ఉన్నారు అని చెప్పాలి. ఇకపోతే అంతర్జాతీయ క్రికెట్లో ఆడుతున్న ప్రతి ప్లేయర్లు కూడా అటు ఐసిసి విడుదల చేసే ర్యాంకింగ్స్ లో అగ్రస్థానాన్ని సొంతం చేసుకోవాలని ఎప్పుడు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు  ఈ క్రమంలోనే ఈ అగ్రస్థానం కోసం ప్రతి మ్యాచ్ లో కూడా మెరుగైన ప్రదర్శన చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక కొంతమంది ఆటగాళ్ళు అనుకున్నట్లుగానే ఇలా నెంబర్ వన్ ర్యాంకును సొంతం చేసుకుంటే మరికొంతమందికి మాత్రం నెంబర్ వన్ ర్యాంక్ అందని ద్రాక్ష లాగే కొనసాగుతూ ఉంటుంది.

 ఇకపోతే అటు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఎప్పటికప్పుడు ఇక మూడు ఫార్మాట్లకు సంబంధించిన ర్యాంకింగ్స్ లను విడుదల చేస్తూ  ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవలే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ విడుదల చేసిన టెస్ట్ బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా ఆటగాడు అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఇది కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. గత కొంతకాలం నుంచి అద్భుతమైన ఫామ్ లో కొనసాగుతూ ఇక జట్టు విజయంలో కీలక పాత్ర వహిస్తున్న మార్నస్ లభూషేణ్ ఇటీవల ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్ అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు.

 ఇటీవల వెస్టిండీస్తో జరిగిన టెస్ట్ లో ఏకంగా డబుల్  సెంచరీ తో చెలరేగిపోయిన లభూషేన్ 935 పాయింట్లతో ఇక అగ్రస్థానంలో కొనసాగుతున్న ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ జోరూట్ ను అధికమించి ఇక తొలి స్థానంలోకి వచ్చేసాడు. అదే సమయంలో గత కొంతకాలం నుంచి చెప్పుకోలేక ప్రదర్శన చేయలేకపోతున్న అత్యుత్తమ ఆటగాడు అయినా జో రూట్ ఏకంగా అగ్రస్థానం నుంచి నాలుగవ స్థానానికి పడిపోయాడు అని చెప్పాలి. అదే సమయంలో ఇటీవలే వెస్టిండీస్ పై డబుల్ సెంచరీ సాధించి అదరగొట్టిన స్మిత్ ఏకంగా రెండవ ర్యాంకుకు చేరుకున్నాడు. ఇక ఇటీవల ఇంగ్లాండు పై సెంచరీ తో చెలరేగిపోయిన పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ మూడవ ర్యాంకును సొంతం చేసుకున్నాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: