అతను మ్యాచ్ ఫిక్సింగ్ చేసాడు : వసీం అక్రమ్

praveen
పాకిస్తాన్ మాజీ ఆటగాడు వసీం విక్రమ్ ఎప్పుడు తన రివ్యూలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే. పాకిస్తాన్ జట్టు సహా భారత జట్టు కూడా ఎక్కడైనా మ్యాచ్ ఆడుతుంది అంటే చాలు ఇక ఆయా జట్ల ప్రదర్శన ఎలా ఉంటుంది అన్న విషయం పై తన రివ్యూలను చెబుతూ ఉంటాడు వసీం అక్రమ్   అయితే మొన్నటి వరకు తన రివ్యూలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన వసీం అక్రమ్.. ఏకంగా పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ గత కొంతకాలం నుంచి వార్తల్లో నిలుస్తూ ఉన్నాడు అని చెప్పాలి.

 వసీం అక్రమ్ పాకిస్తాన్ జట్టులో కొనసాగుతున్న సమయంలో ఇక జట్టుకు కెప్టెన్సీ వహించిన సలీం మాలిక్ పై సంచలన ఆరోపణలు చేశాడు. సలీం మాలిక్ కెప్టెన్ గా ఉన్నప్పుడు తనకంటే రెండేళ్లు సీనియర్ కావడంతో తన చేత అన్ని పనులు చేయించుకునే వాడిని.. బట్టలు ఉతికించడం బూట్లు తుడిపించడం కూడా చేయించాడని తనకంటే జూనియర్ల ముందు అవమానిస్తూ మాట్లాడేవాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇక దీనిపై స్పందించిన సలీం మాలిక్ వసీం అక్రమ్ చేసిన వ్యాఖ్యలు కేవలం సోషల్ మీడియాలో అటెన్షన్ గ్రాబ్ చేయడం కోసమే అని అందులో నిజం లేదు అంటూ కొట్టి పారేశాడు.

 కాగా వసీం అక్రమ్ చేసిన ఈ వ్యాఖ్యల గురించి మరిచిపోక ముందే మరోసారి మరో కెప్టెన్ పై షాకింగ్ కామెంట్స్ చేశాడు ఈ మాజీ ఆటగాడు. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ పై సంచలన ఆరోపణలు చేసాడు. 1996లో లార్డ్స్ టెస్టులో కొందరు బుకీలు 15000 యూరోలు ఆశ చూపారని రషీద్  లతీఫ్ ఒక ఇంటర్వ్యూలో అన్నాడు  అతను నిజంగానే ఆ డబ్బు తీసుకున్నాడు ఏమో.. ఎందుకంటే ఆ విషయాన్ని ఇప్పటి వరకు ఎవరికీ చెప్పలేదు. కాగా ఇలా ఒకరకంగా మ్యాచ్ ఫిక్సింగ్ కి పాల్పడ్డాడు అంటూ రషీద్ లతీఫ్ పై వసీం అక్రమ్ చేసిన వ్యాఖ్యలు కాస్త హాట్ హాపిక్ గా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: