బంగ్లాదేశ్ చేతిలో ఇండియా సిరీస్ ఓటమి !

VAMSI
బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న ఇండియన్ టీం కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఈ సిరీస్ మొదలయ్యే ఒక్క రోజు ముందు రిషబ్ పంత్ గాయం కారణంగా ఇండియాకు వెళ్ళిపోయాడు, కాగా ఇప్పుడు ఈ రోజు జరుగుతున్న రెండవ వన్ డే లో స్లిప్ లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ కు గాయం తగలడంతో వెంటనే మైదానాన్ని వీడి హాస్పిటల్ కు వెళ్ళాడు. అయితే ఇండియా ఇన్నింగ్స్ లో తొమ్మిదవ ఆటగాడిగా బరిలోకి దిగినా... మూడవ వన్ డే మరియు టెస్ట్ సిరీస్ కు అందుబాటులో ఉంటాడా లేదా అన్నది కూడా క్లారిటీ లేదు. ఇదిలా ఉంటే వన్ డే సిరీస్ కు కీలకం అయిన రెండవ వన్ డే లో కాసేపటి క్రితమే ఢాకా లోని షేర్ ఏ బంగ్లా స్టేడియం లో ముగిసింది.
మొదట టాస్ గెలిచిన బంగ్లా బ్యాటింగ్ ఎంచుకుని ఇండియాకు కష్టమైన లక్ష్యాన్ని ఇచ్చింది. బంగ్లా నిర్ణీత ఓవర్ లలో 7 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. బంగ్లా ఇన్నింగ్స్ లో మెహిదీ హాసన్ (100) మరియు మహ్మదుల్లా (77) పరుగులు చేసి గౌరవప్రదమైన టార్గెట్ రావడంలో శ్రమించారు. ఇక ఇండియా బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 3 వికెట్లు మరియు సిరాజ్ 2 వికెట్లు దక్కించుకున్నారు. ఇక 272 పరుగులతో ఛేదన ప్రారంభించిన ఇండియాకు సరైన ఆరంభం లభించలేదు. రెండవ ఓవర్ లోనే కోహ్లీ (5) వికెట్ కోల్పోయింది, ఆ తరువాత ధావన్ (8) కూడా పెవిలియన్ చేరారు. ఆ తరువాత శ్రేయస్ కు తోడుగా వాషింగ్టన్ సుందర్ జత కలిశాడు. సుందర్ నిలదొక్కుకున్నట్లే కనిపించినా 11 పరుగుల వద్ద షకీబ్ బౌలింగ్ లో అవుట్ అయ్యి పెవిలియన్ చేరాడు.
ఇక గత మ్యాచ్ లో అర్ద సెంచరీ చేసిన రాహుల్ కూడా ఈ మ్యాచ్ లో కేవలం 14 పరుగులకే అవుట్ అయ్యాడు. ఇక మ్యాచ్ భారం అంతా శ్రేయాస్ మరియు అక్షర్ పటేల్ ల పైన పడింది. వీరిద్దరూ దాదాపుగా మ్యాచ్ ను గెలిపించేంతగా కష్టపడ్డారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఇద్దరూ శ్రేయాస్ (82) మరియు అక్షర్ పటేల్ (56) అర్ద సెంచరీలు అయ్యాక అవుట్ అయ్యారు. ఇక చివరిగా రోహిత్ శర్మ వచ్చి దాదాపు ఇండియాను గెలిపించినంత పని చేశాడు ఆఖరి ఓవర్ లో పరుగులు చేయాల్సి ఉండగా 6 పరుగుల దూరంలో నిలిచిపోయింది. అలా ఇండియా ఓటమితో వన్ డే సిరీస్ ను కోల్పోయింది.      

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: