సెంచరీతో శివమెత్తిన మెహిదీ హాసన్... ఇండియా గెలిచేనా !

VAMSI
ఈ రోజు ఢాకాలో ఇండియా మరియు బంగ్లాదేశ్ జట్ల మధ్యన రెండవ వన్ డే జరుగుతున్న సంగతి తెలిసిందే. మొదట టాస్ గెలిచిన బంగ్లా కెప్టెన్ లిటన్ దాస్ పిచ్ స్వభావం దృష్ట్యా బ్యాటింగ్ తీసుకున్నాడు. అయితే వీరికి అనుకున్న విధంగా మంచి ఆరంభం దక్కలేదు అని చెప్పాలి. బంగ్లా టీం ఆరు వికెట్లు 20 ఓవర్ ల లోపు కేవలం 69 పరుగులకు కోల్పోయి వందలోపు ఆల్ అవుట్ అయ్యే ప్రమాదంలో పడింది. వరుసగా అనముల్ (11), లిటన్ దాస్ (7), శాంటో (21), షకీబ్ (8), రహీమ్ (12) మరియు అఫిఫ్ (0) లు ఏ మాత్రం ప్రభావం చూపలేక ఇండియా బౌలర్ల దెబ్బకు తోకముడిచారు. ముఖ్యంగా సిరాజ్ వరుస ఓవర్ లలో వికెట్లు తీసి బంగ్లాను కట్టడి చేశాడు.
ఆ తరువాత మొదలైంది అసలైన మ్యాచ్ సీనియర్ ఆటగాడు మహమ్మదుల్లా మరియు మెహిదీ హాసన్ మిరాజ్ లు వికెట్ పడకుండా మ్యాచ్ ను ఇండియా నుండి లాగేసుకున్నారు అని చెప్పాలి. వీరిద్దరూ ఏడవ వికెట్ కు అత్యధికంగా 148 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మహమ్మదుల్లా 77 పరుగుల వద్ద ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ లో కీపర్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మెహిదీ హాసన్ మిరాజ్ ఈ దశలో నజూమ్ మహమ్మద్ తో కలిసి కేవలం 23 బంతుల్లోనే 54 పరుగులు చేసి ఇండియా ముందు 272 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచారు. ఇండియా తరపున వాషింగ్టన్ సుందర్ 3 వికెట్లు తీయగా, సిరాజ్ 2 వికెట్లు తీసుకున్నాడు.
బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ మెహిదీ హాసన్ మిరాజ్ ఎనిమిదవ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి సెంచరీతో జట్టును సురక్షితమైన స్థానానికి చేర్చాడు. ఇతను కేవలం 83 బంతుల్లో సరిగ్గా పరుగులు చేసి సెంచరీ మార్క్ ను చేరుకోవడం విశేషం. కాగా తన కెరీర్ లో మొత్తం 41 వన్ డే లు ఆడగా ఇదే అతనికి మొట్టమొదటి సెంచరీ. ఇతని ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు మరియు 4 సిక్సులు ఉన్నాయి. మరి ఈ స్కోర్ ఇండియా ఛేదిస్తుందా లేదా అన్నది తెలియాలంటే మరో రెండు గంటలు వేచి చూడాల్సిందే.  
   
     

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: