టీమిండియాలోకి ఐపీఎల్ స్టార్.. అదరగొడతాడా?

praveen
ప్రస్తుతం బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న భారత జట్టు అక్కడ వన్డే సిరీస్ ఆడుతుంది. ఈ క్రమంలోనే సీనియర్లతో కూడిన పటిష్టమైన టీమ్ ఇండియా జట్టు బలిలోకి దిగినప్పటికీ మొదటి వన్డే మ్యాచ్లో టీం ఇండియాకు చేదు అనుభవం ఎదురయింది అన్న విషయం తెలిసిందే. ఎంతో బలహీనమైన బంగ్లాదేశ్ జట్టుపై కూడా టీమిండియా విజయం సాధించలేకపోయింది. అంతేకాదు గెలుస్తాము అనుకున్న మ్యాచ్ లో కూడా పేలవమైన ఫీల్డింగ్  కారణంగా ఓడిపోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే టీమ్ ఇండియా మొదటి మ్యాచ్ లో ఓడిపోవడంపై తీవ్రస్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి.

 అయితే మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా నేడు రెండో వన్డే మ్యాచ్ జరుగుతుంది. ఇక సిరిస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలి అంటే మాత్రం టీమ్ ఇండియా తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి. కాగా నేడు మొదటి వన్డే మ్యాచ్ జరిగిన వేదిక పైన రెండో వన్డే మ్యాచ్ కూడా జరగబోతుంది. ఉదయం 11:30 గంటలకి ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే తొలి మ్యాచ్లో బౌలింగ్ పరంగా అద్భుతంగా రాణించినప్పటికీ బ్యాటింగ్ పరంగా మాత్రం దారుణంగా విఫలమైంది టీం ఇండియా జట్టు. ఈ క్రమంలోనే పలు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది అని తెలుస్తుంది.

 తొలి వన్డే మ్యాచ్ లో మోకాలు నొప్పితో బాధపడిన శార్తుల్ ఠాగూర్ కు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. అతని స్థానంలో యువ ఫేసెర్ ఉమ్రాన్ మాలిక్  జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. అదే సమయంలో ఎన్నో రోజుల నుంచి జట్టులో  స్థానం కోసం ఎదురుచూస్తున్న రాహుల్ త్రిపాఠిని జట్టులోకి మేనేజ్మెంట్ తీసుకునేందుకు నిర్ణయించిందట. గత కొంతకాలం నుంచి జట్టు తరఫున చోటు సంపాదించుకున్నప్పటికీ తుది జట్టులో మాత్రం ఇప్పటివరకు అతనికి ఛాన్స్ రాలేదు. దీంతో మొదటిసారి వన్డేలో అరంగేట్రం చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు  ఐపీఎల్ చిచ్చర పిడుగు రాహుల్ త్రిపాఠి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: