మ్యాచ్ ఓడిన బాధలో ఉంటే.. బికినీలో అందాలు ఆరబోసింది?

praveen
సాధారణంగా అంతర్జాతీయ స్థాయిలో స్టార్ ప్లేయర్లుగా కొనసాగుతున్న వారు జట్టు ఎప్పుడైనా ఓడిపోయింది అంటే ఇక వారి స్నేహితులు నిరాశలో ఉన్న ఆటగాళ్లకు మద్దతుగా నిలవడం  లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కానీ ఏకంగా  ఒక స్టార్ ప్లేయర్ మ్యాచ్ ఓడిపోయి నిరాశలో ఉంటే అతని గర్ల్ ఫ్రెండ్ బీచ్ లో ఎంజాయ్ చేస్తూ బికినీ అందాలను ఆరబోస్తే మాత్రం అది కాస్త హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి. ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ లో ఇదే జరిగింది.

 ఇటీవలే సాకర్ ఆటలో స్టార్ ప్లేయర్గా కొనసాగుతున్న క్రిస్టియానో రోనాల్డో నేతృత్వంలోనే పోర్చుగల్ జట్టు ఫిఫా వరల్డ్ కప్ లో భాగంగా రౌండ్ ఆఫ్ 16 కు అర్హత సాధించింది అన్న విషయం తెలిసిందే. అయితే గ్రూప్ దశలో పోర్చుగల్ తమ ఆఖరి మ్యాచ్  లో సౌత్ కొరియా చేతిలో ఓడిపోయింది. అయితే ఇలా సౌత్ కొరియా చేతిలో ఓడిపోయినప్పటికీ అప్పటికే రెండు విజయాలు సాధించిన పోర్చుగల్ జట్టు రౌండ్ ఆఫ్ 16 కు అర్హత సాధించింది అని చెప్పాలి. అదే సమయంలో పోర్చుగల్ జట్టుపై విజయం సాధించిన దక్షిణ కొరియా జట్టు కూడా అటు రౌండప్ 16 కు దూసుకు వెళ్ళింది. అయితే ఇలా పోర్చుగల్ జట్టు ఓడిపోయిన సమయంలో క్రిస్టియానో రోనాల్డో నిరాశలో ఉండగా.. మరోవైపు అతని ప్రేయసి జార్జిన రోడ్రి గేజ్ మాత్రం అందాల ఆరబోత  చేసింది.

 ఏకంగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో స్టేడియంలో తన ప్రియుడు ప్రాతినిథ్యం వహిస్తున్న పోర్చుగల్ జట్టు గెలవాలని కోరుకున్న రోనాల్డో ప్రేయసి జార్జిన మ్యాచ్ ముగిసిన తర్వాత మాత్రం ఖతార్ బీచ్కు వెళ్లి ఏకంగా టూ పీస్ బికినీలో అందాల ప్రదర్శన చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారిపోయాయి. ఓడిన నిరాశలో  రోనాల్డో ఉంటే నీ అందాల ఆరబోత ఏంటి అని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా రోనాల్డో, జార్జిన 2016 నుంచి రిలేషన్షిప్ లో ఉన్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: