అశ్విన్ ను వెనక్కినెట్టిన ఆసీస్ స్పిన్నర్.. అరుదైన రికార్డ్.

praveen
సాధారణంగా క్రికెట్లో టెస్ట్ ఫార్మాట్ సహా వన్డే, టి20 ఫార్మాట్ అనే మూడు ఫార్మాట్లు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే క్రికెట్లో ఎన్ని రకాల ఫార్మాట్లు ఉన్నప్పటికీ అటు ఎంతో మంది క్రికెట్ ప్లేయర్స్ ఇష్టపడేది మాత్రం సుదీర్ఘమైన ఫార్మాట్ గా పిలుచుకునే టెస్ట్ ఫార్మాట్ నే అని చెప్పాలి. ఎందుకంటే టెస్ట్ ఫార్మాట్ అటు ఆటగాళ్ల సామర్థ్యాన్ని వెలికి తీసేందుకు ఉపయోగపడుతూ ఉంటుంది. అంతేకాదు నాణ్యమైన క్రికెట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంటుంది అని చెప్పాలి. అందుకే మిగతా ఫార్మట్లలో భాగమైన ఆటగాళ్లు ఇక టేస్ట్ ఫార్మాట్లో కూడా మంచి ప్రస్థానాన్ని కొనసాగించాలని ఎన్నో ఆశలు పెట్టుకుంటూ ఉంటారు.

 స్టార్ ప్లేయర్స్ టెస్ట్ ఫార్మట్ లో ఎన్నో రికార్డులు కొల్లగొట్టడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఆస్ట్రేలియా  స్పిన్నర్ నాథన్ లియోన్ ఇటీవల టెస్ట్ ఫార్మాట్లో ఒక అరుదైన ఘనత సాధించాడు.. వెస్టిండీస్ ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతుంది. హోరాహోరీగా జరుగుతున్న ఈ పోరులో నువ్వా నేనా అన్నట్లుగానే ఇరు జట్లు తలబడుతూ ఉన్నాయి అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో ఏకంగా ఎనిమిది వికెట్లు పడగొట్టాడు నాథన్ లియోన్. ఈ క్రమంలోనే అరుదైన రికార్డును సృష్టించాడు.

 సుదీర్ఘ ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఎనిమిదవ స్థానానికి ఎగబాగాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే అరుదైన రికార్డు సాధించిన ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియోన్ టీమిండియా  స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ను వెనక్కి నెట్టేసాడు అని చెప్పాలి. ఇప్పటివరకు అశ్విన్ 86 టెస్ట్ మ్యాచ్లలో 442 వికెట్లు పడగొట్టగా నాథన్ లియోన్ 111 టెస్ట్ మ్యాచ్లు ఆడి  ఏకంగా 446 వికెట్లు పడగొట్టాడు. ఈ లిస్టులో మురళీధరన్ 133 మ్యాచ్లో 800 వికెట్లతో అగ్ర స్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా దిగ్గజం షైన్ వార్న్ 145 మ్యాచ్లో 708 వికెట్లు, ఇంగ్లాండ్ ఫేసెస్ జేమ్స్ అండర్సన్ 178 మ్యాచ్లో 668 వికెట్లు, భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే 132 మ్యాచులలో 619 వికెట్లు, స్టువర్టు బ్రాడ్ 159 మ్యాచ్లో 56 వికెట్లు, ఆసిస్ లెజెండ్ గ్లెన్ మెక్ గ్రోత్ 124 మ్యాచ్ల్లో 563వికెట్లతో ఈ లిస్టులో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: