కొత్త సెలక్షన్ కమిటీ.. బీసీసీఐ కీలక నిర్ణయం?

praveen
గత కొంతకాలం నుంచి బీసీసీఐలో ఎవరి ఊహకందని విధంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయ్ అన్న విషయం తెలిసిందే  ముఖ్యంగా బీసీసీఐ కొత్త బాస్ గా రోజర్ ఎంపికైన తర్వాత అతను తీసుకుంటున్న నిర్ణయాలు అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉన్నాయి. పాత అధ్యక్షుడు సౌరబ్ గంగూలీ ఉన్న సమయంలో నియమించిన అందరు సిబ్బందిని కూడా తొలగిస్తూ రోజర్ బిన్నీ నిర్ణయం తీసుకుంటున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే చేతన్ శర్మ  నేతృత్వంలోని భారత సెలక్షన్ కమిటీని కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాడు రోజర్ బిన్ని.

 ఇటీవల టి20 వరల్డ్ కప్ లో అటు భారత జట్టు పూర్తిగా విఫలమైన నేపథ్యంలో ఇక జట్టులో అనూహ్యమైన మార్పులు తీసుకురావాలని భావిస్తున్నాడు అని చెప్పాలి. తద్వారా ఏకంగా రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి కూడా తప్పించే ఛాన్స్ ఉంది అంటూ గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. హార్దిక్ పాండ్యా కు కెప్టెన్సీ  అప్పగిస్తారని ఎంతో మంది చర్చించుకుంటున్నారు.  అయితే ఇటీవల సెలక్షన్ కమిటీని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. ఇక ఎవరిని కొత్త సెలెక్షన్ కమిటీలోకి తీసుకుంటారు అన్నది కూడా ఆసక్తికరంగా మారిపోయింది.

 ఇకపోతే ఇటీవల ఏకంగా క్రికెట్ అడ్వైజరి కమిటీ విషయంలో కూడా బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది అని చెప్పాలి. ఏకంగా క్రికెటర్ అడ్వైజరీ కమిటీ సభ్యులుగా అశోక్ మల్హోత,  జతిన్ పరంపజే,  సులక్షణ నాయక్ లను బిసిసిఐ నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక ఈ కొత్త అడ్వైజరి కమిటీ సెలక్షన్ కమిటీ ప్యానెల్ పై నిర్ణయం తీసుకోబోతుంది అన్నది తెలుస్తుంది. అయితే బీసీసీఐ సెలక్షన్ కమిటీని రద్దు చేసిన తర్వాత ఇక కొత్త సెలెక్షన్ కమిటీ కోసం దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించగా.. 50 మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇక వీరిలో ఎవరు నూతన సెలక్షన్ కమిటీలోకి వస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: