బ్రాడ్ మన్ రికార్డుకే.. ఎసరు పెట్టిన స్టీవ్ స్మిత్?

praveen
గత కొంతకాలం నుంచి ఆస్ట్రేలియా జట్టు లో స్టార్ క్రికెటర్ గా స్టీవ్ స్మిత్ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు అన్న విషయం తెలిసిందే  టి20 ఫార్మాట్ కు ఇప్పటికే దూరమైన స్మిత్ వన్డే, టెస్ట్ ఫార్మాట్లలో మాత్రం అదరగొడుతూ ఉన్నాడు. మరోసారి తన మార్కు చూపిస్తూ తాను ఎంత అత్యుత్తమ ఆటగాడిని అన్న విషయాన్ని తన బ్యాటింగ్ తోనే నిరూపిస్తూ ఉన్నాడు అని చెప్పాలి.  మొన్నటికీ మొన్న వన్డే సిరీస్లో అద్భుతమైన ప్రదర్శన చేసి ఆకట్టుకున్న స్మిత్ ఇక ఇప్పుడు సొంత గడ్డపై జరుగుతున్న టెస్టు సిరీస్ లో కూడా ఇదే రీతిలో చెలరేగిపోతూ అభిమానులు అందరిని కూడా సంతోషంలో ముంచేస్తూ ఉన్నాడు.

 ఇటీవల ఆస్ట్రేలియాలో వెస్టిండీస్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భాగంగా డబుల్ సెంచరీ తో చెలరేగిపోయాడు స్మిత్  అయితే కేవలం స్మిత్ మాత్రమే కాదు లబు షేన్ సైతం అజయమైన డబుల్ సెంచరీ చేయడంతో అటు ఆస్ట్రేలియా జట్టు భారీ స్కోరు చేసింది అని చెప్పాలి  అయితే ఇప్పటికే తన కెరీర్లో ఎన్నో అద్భుతమైన రికార్డులను కొల్లగొట్టిన స్టీవ్ స్మిత్ ఇక ఇటీవల ఏకంగా క్రికెట్ లెజెండ్ రికార్డును కూడా బ్రేక్ చేశాడు అని చెప్పాలి. ఇక ఇందుకు సంబంధించిన వార్త కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం అయిన బ్రాడ్ మాన్ చేసిన 29 టెస్ట్ సెంచరీల రికార్డును స్మిత్ సమం చేశాడు. బ్రాడ్మన్ తన కెరీర్లు 52 మ్యాచ్లలో ఇలా 29 టెస్ట్ సెంచరీల రికార్డును అందుకున్నాడు. అయితే స్టీవ్ స్మిత్ కి మాత్రం ఇక ఈ అరుదైన రికార్డ్ సాధించడానికి 88 మ్యాచులు సమయం పట్టింది అని చెప్పాలి. వెస్టిండీస్ తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో స్మిత్ ఈ రికార్డును నమోదు చేశాడు అని చెప్పాలి. ఇక ఈ లిస్టులో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 41 సెంచరీలతో టాప్ ప్లేస్ లో ఉన్నాడు. ఆ తర్వాత స్టీవ్ వా 32 సెంచరీలు,   మాథ్యూ హెడెన్  30 సెంచరీలతో ఈ లిస్టులో కొనసాగుతూ ఉన్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: