ఇండియా vs న్యూజిలాండ్: సంజు శాంసన్ లేని లోటు "క్రిస్టల్ క్లియర్" !

VAMSI
ఈ రోజు క్రైస్ట్ చర్చ్ వేదికగా ఇండియా మరియు న్యూజిలాండ్ జట్ల మధ్యన మూడవ వన్ డే జరుగుతోంది. ఈ సిరీస్ లో వరుసగా మూడవ సారి కెప్టెన్ శిఖర్ ధావన్ టాస్ ఓడిపోవడంతో కివీస్ బౌలింగ్ ఎంచుకోవడంతో మొదట బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ఈ రోజు సిరీస్ ను కివీస్ కు దక్కకుండా చేయాలంటే ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్, అయినా ఆ కసి ఇండియా ఆటగాళ్లలో కనిపించలేదు అని చెప్పాలి. వన్ డే మ్యాచ్ లో నిదానంగా స్టాండ్ అయ్యి ఆడే అవకాశం ఉన్నప్పటికి ఎందుకో ఓపిక లేని వారిలా ఆడిన విధానం అభిమానులను నిరాశపరిచింది. టాప్ ఆర్డర్ మొత్తం ఎటువంటి బాధ్యత లేని ఇన్నింగ్స్ ఆడి కుప్పకూలింది.
వరుసగా ధావన్ (28), గిల్ (13), శ్రేయాస్ అయ్యర్ (49), పంత్ (10), సూర్యకుమార్ యాదవ్ (6), దీపక్ హూడా (12) లలో శ్రేయాస్ మినహాయించి మరెవ్వరూ ఆకట్టుకునే ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. ఇక ఈ సిరీస్ మొదలు నుండి అటు అభిమానులలో మరియు మాజీ క్రికెటర్లలో జరుగుతున్న చర్చ ఒక్కటే పంత్ కు బదులుగా శాంసన్ ను ఎందుకు తుదిజట్టులోకి తీసుకోవడం లేదు. కేవలం మొదటి వన్ డే లో మాత్రం శాంసన్ ను జట్టులోకి తీసుకున్నారు. కానీ ఆ మ్యాచ్ లో శాంసన్ 38 బంతులు ఆడి 36 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత మళ్ళీ శాంసన్ కు అవకాశం రాలేదు.
పైగా శాంసన్ మరియు పంత్ లలో, పంత్ ను తీసుకునే విషయంలో టీం ఇండియా యాజమాన్యం పాజిటివ్ గా ఉన్నా, బయట అభిమానులు మరియు మాజీ క్రికెటర్లు శాంసన్ కు మద్దతుగా నిలబడుతున్నారు. ఈరోజు మ్యాచ్ లో శాంసన్ ఉండి ఉంటే పరుగులు నెమ్మదిగా వచ్చినా... వికెట్లు కోల్పోకుండా స్టాండర్డ్ ఇచ్చేవాడని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వన్ డే లలో వికెట్ కోల్పోకుండా పరుగులు చేసే ఆటగాళ్లకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఇక నెక్స్ట్ సిరీస్ లలో ఖచ్చితంగా శాంసన్ కు స్థానం ఉంటుంది అని నిస్సందేహంగా చెప్పవచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: