సిరీస్ కోల్పోయే ప్రమాదంలో ఇండియా... పరువు పోయినట్టేనా !

VAMSI
ఇండియా మరియు న్యూజిలాండ్ ల మధ్య జరుగుతున్న మూడు వన్ డే ల సిరీస్ లో ఆఖరి మరియు నిర్ణయాత్మక వన్ డే క్రిస్ట్ చర్చ్ వేదికగా జరుగుతోంది. ఇప్పటికే మొదటి వన్ డే ను 7 వికెట్ల తేడాతో ఆతిధ్య న్యూజిలాండ్ గెలుచుకుని ముందంజలో ఉంది. రెండవ వన్ డే వర్షం కారణంగా రద్దు అయిన విషయం తెలిసిందే. కాగా సిరీస్ గెలిచే అవకాశం ఎలాగు ఇండియాకు లేదు అని తేలిపోయింది. కానీ ఈ రోజు జరుగుతున్న మూడవ వన్ డే లో గెలిచి సిరీస్ ను డ్రా చేసుకునే అవకాశం అయితే ఉంది. కానీ పరిస్థితి చూస్తుంటే అలా లేదు. మొదట టాస్ గెలిచిన కెప్టెన్ విలియమ్సన్ మరోసారి ఫీల్డింగ్ ను ఎంచుకున్నాడు.
మొదట బ్యాటింగ్ చేపట్టిన ఇండియా ఇన్నింగ్స్ ఏమంత సజావుగా సాగడం లేదు. శిఖర్ ధావన్ (28) మరియు గిల్ (13) లు శుభారంభాన్ని అందించడంలో విఫలం అయ్యారు. వన్ డౌన్ లో వచ్చిన శ్రేయాస్ అయ్యర్ (49) మాత్రం పర్వాలేదనిపించాడు. పంత్ మరోసారి తన పూర్ ఫామ్ ను కొనసాగించాడు... కేవలం 10 పరుగులే చేసి పెవిలియన్ కు చేరుకున్నాడు. టీ 20 వరల్డ్ ర్యాంక్ లలో నెంబర్ వన్ స్థానంలో ఉన్న సూర్యకుమారి యాదవ్ సైతం మొదటి వన్ డే లో అవుట్ అయిన విధంగా స్లిప్ లో క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. హూడా కూడా ఈ సిరీస్ లో వచ్చిన అన్ని అవకాశాలను పడు చేసుకున్నాడు, మరోసారి కష్టాల్లో ఉన్న ఇండియాను ఆదుకుని హీరోగా నిలిచే అవకాశాన్ని వదులుకున్నాడు.
దీనితో భారత్ కష్టాల్లో పడింది, న్యూజిలాండ్ ఇండియాను ఏ దశలోనూ కోలుకోనీయకుండా వరుస వికెట్ లను తీస్తూ ఒత్తిడిని పెంచింది. కివీస్ బౌలర్లలో ఆడమ్ మిల్నే 3 వికెట్లు మరియు మిచెల్ 2 వికెట్లు తీసి ఇండియా వెన్ను విరిచారు. కనీసం 200 పరుగులు అయినా చేస్తుందా అన్న సందేహాన్ని కలిగిస్తోంది. ప్రస్తుతం వాషింగ్టన్ సుందర్ ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తున్నాడు. మరి చూద్దాం ఇండియా ఎన్ని పరుగులు చేస్తుందో ?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: