అంబటి రాయుడు పరిస్థితే.. ఇప్పుడు సంజుకి : పాక్ మాజీ

praveen
ఇటీవల కాలంలో సంజు శాంసన్ వచ్చిన అడపాదడప అవకాశాల్లో బాగా రాణిస్తూ ఉన్నప్పటికీ అతనికి తుది జట్టులో మాత్రం అవకాశాలు చాలా తక్కువగా వస్తూ ఉండడంపై  అభిమానులు అందరూ కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారనే విషయం తెలిసిందే. సంజు శాంసన్ ప్రతిభగల ఆటగాడు అన్న విషయం సెలెక్టర్లకు తెలిసినప్పటికీ కూడా కావాలని అతన్ని పక్కన పెడుతున్నారని వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు అంటూ అభిమానులు అందరూ కూడా సోషల్ మీడియా వేదికగా బీసీసీఐపై తీవ్రస్థాయిలో విమర్శలకు గుప్పిస్తున్నారు.

 మొన్నటికి మొన్న టి20 సిరీస్లో తుది జట్టు ఎంపికలు అతని పరిగణలోకి కూడా తీసుకోలేదు. అయితే ఇక శిఖర్ ధావన్ కెప్టెన్సీ లో బరిలోకి దిగిన టీమిండియాలో మొదటి వన్డే మ్యాచ్లో ఛాన్స్ తగ్గించుకుని మంచి ప్రదర్శన చేశాడు సంజూ. కానీ అదనపు బౌలర్ అనే కారణం చెప్పి రెండో వన్డేలో అతని తీసేశారు. ఈ క్రమంలోనే పేలవమైన ఆటగాళ్ళకు వరుస చాన్స్ ల ఇస్తూ మంచి ఫామ్ లో ఉన్న సంజు శాంసన్ ను పక్కన పెట్టడంపై ఎంతో మంది మాజీ ఆటగాళ్లకు కూడా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు అని చెప్పాలి.

 ఇటీవల ఇదే విషయంపై పాకిస్తాన్ మాజీ ఆటగాడు  కనేరియా తన యూట్యూబ్ ఛానల్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కొన్నేళ్ల క్రితం అంబటి రాయుడు కెరియర్ కూడా ఇలాగే నాశనం చేశారు. అతను చాలా పరుగులు చేసిన అవకాశాలు అందుకోలేకపోయాడు. బీసీసీఐ సెలక్షన్ కమిటీలో నెలకొన్న అంతర్గత రాజకీయాలు దీనికి ప్రధాన కారణం. ఆటగాళ్లపై సెలెక్టర్లకు ఉన్న ఇష్టంతో ఇలా చేశారు అంటూ  కరేరియా చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ ద్వారా టీమ్ ఇండియాలో అడుగుపెట్టిన అంబటి రాయుడు  ద్వైపాక్షిక సిరీస్లో అద్భుతంగా రాణించినప్పటికీ వరల్డ్ కప్ లో మాత్రం సెలెక్ట్ చేయలేదు.

 అచ్చంగా ఇలాగే ప్రస్తుతం ఎక్స్ ట్రా బౌలింగ్ ఆప్షన్ పేరు చెబుతూ సంజు శాంసన్ ను పక్కన పెడుతున్నారు. కానీ సంజు శాంసన్ లాంటి ప్లేయర్కు అవకాశాలు ఇవ్వకపోతే మాత్రం టీమిండియా ఒక మంచి ప్లేయర్ని కోల్పోతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అంటూ  కనేరియా హెచ్చరించాడు. ఓ ఆటగాడు ఎంత తట్టుకోగలడు సంజు శాంసన్ ఇప్పటికే చాలా భరించాడు. ఎంతోమంది క్రికెట్ ప్రేక్షకులు సంజు శాంసన్ బ్యాటింగ్ చూడాలనుకుంటున్నారు. ముఖ్యంగా అతడు ఆడే ఫుల్ షాట్స్ అద్భుతంగా ఉంటాయి అంటూ కనేరియా చెప్పుకొచ్చాడు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: