ఉమ్రాన్ తో పోటీ ఏంటి.. అతడుంటే నాకే ప్రయోజనం : అర్షదీప్

praveen
సాధారణంగా జట్టులో ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు అంటే ఆ ఇద్దరి మధ్య తీవ్రమైన పోటీ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఒకరి కంటే మరొకరు అద్భుతమైన ప్రదర్శన చేయడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఇటీవల న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా ఇద్దరు యువ ఆటగాళ్లు వన్డేలలోకి అరగడం చేశారు అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే టీ20 లలోకి అరంగేట్రం చేసి సత్తా చాటిన అర్షదీప్ సింగ్, ఫాస్ట్ బౌలింగ్ తో అందరినీ మెస్మరైజ్ చేసిన ఉమ్రాన్ మాలిక్ వన్డే ఫార్మాట్లోకి అడుగు పెట్టారు.

 ఇక ఒకే రోజు ఒకే మ్యాచ్ ద్వారా ఇద్దరు కూడా వన్డే కెరియర్ ప్రారంభించారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే సహజంగా అయితే వీరిద్దరి మధ్య తీవ్రమైన పోటీ ఉంటుందని అందరూ భావిస్తూ ఉంటారు. కానీ ఎలాంటి పోటీ లేదని అంతేకాకుండా ఉమ్రాన్ మాలిక్ జట్టులో ఉండి మరోవైపు నుంచి బౌలింగ్ చేయడం నాకు ఎంతో ఉపయోగపడుతుంది అంటూ ఇటీవలే అర్షదీప్  చెప్పుకొచ్చాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఉమ్రాన్ మాలిక్ తో బౌలింగ్ చేయడంపై అర్షదీప్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

 ఉమ్రాన్ మాలిక్ తో కలిసి బౌలింగ్ చేయడం ఎప్పుడూ బాగుంటుంది. అలాగే డ్రెస్సింగ్ రూమ్ లో వాతావరణం సరదాగా ఉంటుంది. ఇక ఉమ్రాన్ నుంచి నాకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. నేను ఉమ్రాన్ కలిసి వరుసగా ఓవర్లు వేయడం వల్ల బ్యాట్స్మెన్లు ఇబ్బంది పడే అవకాశం ఉంది. అతను 150 కిలోమీటర్ల వేగంతో బంతి వేస్తాడు. నేను 135 కిలోమీటర్ల వేగంతో బంతులను సంధిస్త.. దీంతో ఫేసులో మార్పు వస్తుంది. ఈ కారణంతో బ్యాట్స్మెన్లు అయోమయానికి గురవుతారు. మేమిద్దరం సుదీర్ఘకాలం ఇలాగే భాగస్వామ్యం కొనసాగిస్తాం. టి20లతో పోల్చి చూస్తే వన్డే క్రికెట్లో  బౌలింగ్ చేయడం కాస్త డిఫరెంట్ అంటూ అర్షదీప్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: