నేడే మూడో వన్డే.. ఇండియా సిరీస్ కోల్పోయినట్లేనా?

praveen
న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా వరుస సిరీస్ లు ఆడుతున్న టీమిండియా ఇప్పటికే టీ20 సిరీస్ ముగించుకుని ప్రస్తుతం వన్డే సిరీస్ ఆడుతుంది. హార్థిక్ పాండ్యా కెప్టెన్సీలో టీ20 సిరీస్ ఆడిన టీమిండియా జట్టు 1-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. అయితే వన్డే ఫార్మాట్లో మాత్రం అదే రీతిలో శుభారంభం  చేయలేక పోయింది అని చెప్పాలి. శిఖర్ ధావన్ కెప్టెన్సీలో బరిలోకి దిగిన టీమిండియా జట్టు మొదటి మ్యాచ్ లో ఓడిపోయింది. అయితే ఇక టీమిండియా పుంజుకునేందుకు రెండు మ్యాచ్లు అవకాశం ఉండడంతో టీమిండియా అభిమానులు పెద్దగా నిరాశ పడలేదు.

 కానీ ఊహించిన రీతిలో వర్షం కారణంగా రెండో వన్డే మ్యాచ్ రద్దయింది. దీంతో టీమిండియా సిరీస్ ఆశలు నిలబెట్టుకునే అవకాశాలు సంక్లిష్టంగా మారిపోయాయి అని చెప్పాలి. అయితే ఒక మ్యాచ్ లో విజయం సాధించిన న్యూజిలాండ్ జట్టు ఇప్పటికే 1-0 తేడాతో ఆధిక్యంలో కొనసాగుతుంది. దీంతో సిరీస్ సమం చేయాలి అంటే అటు టీమ్ ఇండియా జట్టు మూడో వన్డే మ్యాచ్ లో తప్పకుండా గెలవాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే నేడు మూడవ వన్డే మ్యాచ్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే.

 క్రైస్ట్ చర్చ్ లోనే హాగ్లే పార్క్ వేదికగా మూడో వన్డే మ్యాచ్ జరుగుతుండగా.. ఇక ఈ మ్యాచ్ కి కూడా అటు వరుణ గండం పొంచి ఉంది  అన్నది తెలుస్తుంది. కేవలం కాసేపు వర్షం కురవడం కాదు.. పూర్తిగా మ్యాచ్ అయ్యే రద్దు విధంగా వర్షపు జల్లులు కురిసే అవకాశం ఉందట. ఉదయం ఏడు గంటల నుంచి ఇక ఆకాశం మొత్తం మేఘామృతమై ఉంటుందని.. మ్యాచ్ సమయానికి తప్పకుండా వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. కాస్త ఆలస్యమైన వర్షం కురవడం ఖాయమని.. మ్యాచ్ జరగడం డౌటే అంటూ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దీంతో ఇదే జరిగితే టీమ్ ఇండియా సిరీస్ కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఫ్యాన్స్ ఆందోళనలో మునిగిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: