అతను కెప్టెన్ గా ఉన్నప్పుడు.. నాతో బూట్లు తుడిపించుకున్నాడు : మాజీ క్రికెటర్

praveen
పాకిస్తాన్ క్రికెట్లో ఫాస్ట్ బౌలర్గా ఎన్నో ఏళ్ల పాటు సేవలు అందించిన వసీం అక్రమ్ ఇక పాకిస్తాన్ జట్టుకు అద్భుతమైన విజయాలు అందించడంలోనూ కీలకపాత్ర వహించాడు అని చెప్పాలి. అయితే క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా అభిమానులకు సోషల్ మీడియా వేదికగా దగ్గరగానే ఉంటున్నాడు. ఈ క్రమంలోనే అంతర్జాతీయ క్రికెట్ లో ఏ మ్యాచ్ జరిగిన కూడా ఇక ఆ మ్యాచ్ పై తన రివ్యూలను ఇస్తూ ఎప్పుడు సోషల్ మీడియాలో హార్ట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాడు వసీం అక్రమ్. అంతేకాదు ఇక భారత్ పాకిస్తాన్ ఆటగాళ్ల తీరుపై కూడా తన అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ఉంటాడు.

 ఇక ఇలా ఇప్పటివరకు క్రికెట్ రివ్యూల ద్వారా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయిన పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వసిం అక్రమ్ ఏకంగా తన కెరీర్లో ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో వెల్లడించి ప్రస్తుతం వార్తల్లో నిలిచాడు అని చెప్పాలి. ఏకంగా తాను పాకిస్తాన్ జట్టులో కొనసాగిన సమయంలో  జట్టు కెప్టెన్ గా ఉన్న ఆటగాడు తన పట్ల ఎంత దారుణంగా వ్యవహరించాడు అన్న విషయాన్ని ఇటీవలే చెప్పుకొచ్చాడు వసీం అక్రమ్.  ఒకప్పుడు వసీం అక్రమ్ జట్టులో ఉన్న సమయంలో పాకిస్తాన్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన సలీం మాలిక్ పై షాకింగ్ కామెంట్స్ చేశాడు.

 తాను పాకిస్తాన్ జట్టులో ఉన్న సమయంలో కెప్టెన్ సలీం మాలిక్ కంటే తాను రెండేళ్లు జూనియర్ కావడంతో తనను ఏకంగా పని వాడిలా చూసేవాడు అంటూ వసీం అక్రమ్ చెప్పుకొచ్చాడు. కొన్ని కొన్ని సార్లు నాతో బట్టలు ఉతికించడం కూడా చేశాడు. అంతేకాదు మసాజ్ చేయించుకుని.. ఇక అతని బూట్లు కూడా తుడిపించుకున్నాడు అంటూ షాకింగ్ ఆరోపణలు చేశాడు.. ఇక తన కంటే జూనియర్లు అయినా రమిజ్, షాహిద్, తాహిర్లను మాత్రం అతనితో పాటు నైట్ క్లబ్బులకు తీసుకెళ్లేవాడు. ఇక ఇలాంటివి చూసినప్పుడు ఎంతో కోపం వచ్చేది అంటూ వసీం అక్రమ్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: