నేను డ్రగ్స్ కి బానిసగా మారాను : మాజీ క్రికెటర్

praveen
సాధారణంగా క్రికెటర్లకు సోషల్ మీడియాలో కాస్త ఎక్కువగానే క్రేజ్ ఉంటుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక క్రికెటర్లకు సంబంధించిన ఏ చిన్న విషయం తెర మీదకి వచ్చినా కూడా అది నిమిషాల వ్యవధిలో వైరల్ గా మారిపోతూ ఉంటుంది. అయితే క్రికెటర్లు ఎప్పుడు పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలను కాస్త రహస్యంగా ఉంచడానికి ఇష్టపడుతూ ఉంటారు. కేవలం తమ ప్రొఫెషనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలను ఎక్కువగా అభిమానులతో పంచుకోవడం లాంటివి చేస్తూ ఉన్నారు.

 అయితే కొంతమంది క్రికెటర్లు మాత్రం అటు క్రికెట్లో కొనసాగిన సమయంలో ఇక క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులకు ఎప్పుడు దగ్గరగానే ఉంటూ అభిమానులను అలరిస్తూనే ఉన్నారు అని చెప్పాలి. ఇక అలా అభిమానులకు ఎప్పుడు సోషల్ మీడియా ద్వారా అప్డేట్లు ఇచ్చే మాజీ క్రికెటర్లలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వసిం అక్రమ్ కూడా ఒకరు అని చెప్పాలి. ప్రపంచ క్రికెట్ లో ఏ మ్యాచ్ జరిగిన కూడా వసీం అక్రమ్ తనదైన రివ్యూలు ఇస్తూ సోషల్ మీడియాలో ఎప్పుడు హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాడు.

 ఇకపోతే ఇటీవల  వసీం అక్రమ్ ఏకంగా సోషల్ మీడియాలో తన పర్సనల్ లైఫ్ గురించి ఎవరికీ తెలియని ఎన్నో షాకింగ్ విషయాలు అని చెప్పి అభిమానులను సైతం ఆశ్చర్యపరిచాడు. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత తాను కోకైన్ అనే డ్రగ్ కి బానిసగా మారిపోయాను అంటూ వసీం అక్రమ్ చెప్పుకొచ్చాడు. ఎంతలా అంటే కనీసం ఒక్కరోజు కూడా ఆ డ్రగ్ లేకుండా ఉండలేకపోయాను. చివరికి ఆ డ్రగ్ కి బానిసగా మారిపోయి నా భార్యని కూడా తీవ్రంగా బాధపెట్టాను అంటూ ఇటీవల ఇంటర్వ్యూలో తెలిపాడు. చివరికి ఓ పునరావస కేంద్రంలో రెండున్నర నెలలు ఉన్నాను. అదొక భయంకరమైన ప్రదేశం. ఇక బయటికి వచ్చిన కొన్నాళ్లకే నా భార్య మరణించింది. తర్వాత నాలో మార్పు వచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: