రెండో వన్డే మ్యాచ్.. ఇక పంత్ కు నో ఛాన్స్?

praveen
ప్రస్తుతం శిఖర్ ధావన్ కెప్టెన్సీలో న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా భారత జట్టు ఆడుతున్న వన్డే సిరీస్ లో భాగంగా టీమిండియా కు మొదటి మ్యాచ్ లోనే చేదు అనుభవం ఎదురయింది. ఏకంగా న్యూజిలాండ్ చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది అన్న విషయం తెలిసిందే. అయితే బ్యాటింగ్ విభాగం బాగానే రానించినప్పటికీ బౌలింగ్ విభాగం మాత్రం న్యూజిలాండ్ బ్యాట్స్మెన్లను కట్టడి చేయలేకపోయింది అని చెప్పాలి.

 అదే సమయంలో ఇక మొదటి వన్డే మ్యాచ్ లో టీమిండియా బ్యాటింగ్ చూసిన తర్వాత కొంతమంది ఆటగాళ్ల మార్పు చేయాల్సిన అవసరం ఉందని ఎంతో మంది అభిమానులు కూడా భావించారు. ఈ క్రమంలోనే నేడు జరగబోయే రెండు వన్డే మ్యాచ్లో శిఖర్ ధావన్ కొన్ని మార్పులతో బరిలోకి దిగబోతున్నాడు అన్నది తెలుస్తూ ఉంది. ముఖ్యంగా మొన్నటికీ మొన్నటి టి20 వరల్డ్ కప్ లో ఇక న్యూజిలాండ్ తో జరిగిన టి20 సిరీస్ లో ఇక  మొదటి వన్డే మ్యాచ్ లో కూడా పేలవమైన బ్యాటింగ్ తో  నిరాశపరిచిన రిషబ్ పంత్ ను పక్కన పెట్టి అతని స్థానంలో ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్న దీపక్ హుడాను జట్టులోకి తీసుకునే ఉంది అనేది తెలుస్తుంది.
 ఒకవేళ పంత్ ను జట్టు నుంచి పక్కన పెట్టారు అంటే ఏకంగా జట్టు వైస్ కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ బాధ్యతలు నిర్వహించే అవకాశం ఉంది. అదే సమయంలో తొలి వన్డే మ్యాచ్లో దారుణంగా విఫలమైన చాహల్ స్థానంలో కుల్దీప్ యాదవ్ కు చోటి దక్కే ఛాన్స్ ఉంది అన్నది తెలుస్తుంది. తొలి వన్డే మ్యాచ్లో 10 ఓవర్ల కోటలో ఒక వికెట్ కూడా తీయకుండా 67 పరుగులు సమర్పించుకున్నాడు చాహల్. అదే సమయంలో దీపక్ చాహార్ ఒకవేళ కోలుకుంటే ఇక శార్దూల్ ఠాగూర్ స్థానంలో అతను తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: