ఇండియన్ ఫాన్స్ అభిమానం చూసి.. మెస్సి ఫిదా?

praveen
ప్రస్తుతం ఫుట్బాల్ ఆటలో లెజెండరి ప్లేయర్ గా కొనసాగుతున్న లియోనాల్ మెస్సి కి అటు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే భారత్లో కూడా లియోనల్ మెస్సినీ అభిమానించేవారు కోట్లల్లోనే ఉన్నారు  ఈ క్రమంలోనే ఇక అతను ప్రాతినిధ్యం వహిస్తున్న అర్జెంటిన  జట్టు ఎక్కడైనా మ్యాచ్ ఆడుతుందంటే చాలు భారత్ నుంచి అభిమానులు భారీగా తరలి వెళ్తూ ఉంటారు. ఇక తమ ఆరాధ్య ఆటగాడిని చూసేందుకోసం గంటలకొద్దీ నిరీక్షించడం చేస్తూ ఉంటారు అని చెప్పాలి.

 అలాంటిది ప్రతిష్టాత్మకమైన ఫిఫా వరల్డ్ కప్ ఆడేందుకు ఇక లియోనల్ మెస్సి జట్టుతో కలిసి ఖతార్కు వస్తున్నాడు అంటే అభిమానులు ఎలా ఊరుకుంటారూ. ఈ క్రమంలోనే ఇటీవలే మెస్సి తన టీం తో కలిసి ఖాతార్ లో అడుగుపెట్టాడు. అయితే అక్కడ ఉన్న వందల మంది అభిమానుల్లో భారతీయులే ఎక్కువగా ఉండడం గమనార్హం. ఇక లియోనల్ మెస్సి బస్సు దిగి హోటల్లోకి వెళ్తున్న సమయంలో భారత అభిమానులు అందరూ కూడా అతన్ని చూసి సంతోషంతో ఊగిపోయారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున డ్రమ్స్ వాయించి అతనికి గ్రాండ్గా వెల్కమ్ ఇచ్చారు అని చెప్పాలి.

 అయితే ఇలా భారత అభిమానులు తనకు గ్రాండ్ గా వెల్కమ్ ఇవ్వడం చూసి సంతోషంలో మునిగిపోయాడు లియోనల్ మెస్సి తనకోసం గంటల కొద్ది నిరీక్షిస్తున్నారు అన్న సంగతి తెలుసుకొని అభిమానులపై ముద్దుల వర్షం కురిపించాడు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల అర్జెంటీనా  జట్టు ఖతార్ కు చేరుకుంది. అంతకుముందు వార్మప్ మ్యాచ్  లో అర్జెంటినా 5-0 తేడాతో విజయం సాధించింది. ఇందులో ఒక గోల్ చేసిన మెస్సి తన 91వ అంతర్జాతీయ గోల్ను అందుకున్నాడు. ఈ క్రమంలోనే అర్జెంటీనా జట్టు తన తొలి మ్యాచ్ను వచ్చే మంగళవారం సౌదీ అరేబియా తో ఆడబోతుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: