షాహిన్ ఉండుంటే.. కథ వేరేలా ఉండేది : బాబర్

praveen
ఆస్ట్రేలియా వేదికగా ప్రారంభమై అక్టోబర్ 16వ తేదీ నుంచి క్రికెట్ ప్రేక్షకులందరికీ అసలు సిసలైన ఎంటర్టైన్మెంట్ పంచిన టి20 వరల్డ్ కప్ ఎట్టకేలకు ముగిసింది అన్న విషయం తెలిసిందే. ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్లతో ఇక క్రికెట్ ప్రేక్షకులందరికీ అసలు సిసలైన కిక్ ఇచ్చింది ఈ వరల్డ్ కప్. ఇక ఎన్నో మ్యాచ్ లలో  ఊహ కందని ఫలితాలు కూడా ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాయి అని చెప్పాలి. ఇకపోతే వరల్డ్ కప్ ఫైనల్లో భాగంగా  పాకిస్తాన్, ఇంగ్లాండ్ హోరాహోరీగా తలబడ్డాయి. ఉత్కంఠ భరితంగా  జరిగిన పోరులో అటు ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించి ఏకంగా రెండో సారి టి20 వరల్డ్ కప్ టైటిల్ గెలుచుకున్న జట్టుగా అవతరించింది అని చెప్పాలి.

 అయితే ఇక ఇటీవలే జరిగిన టి20 వరల్డ్ కప్ ఫైనల్లో అటు ఇంగ్లాండ్ కు అదృష్టం కూడా కలిసి వచ్చింది అని చెప్పాలి. ఈ మ్యాచ్ లో భాగంగా ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఈ క్రమంలోనే నిర్ణయిత 20 ఓవర్లలో 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండు ఎంతో అలవోకగా విజయం సాధిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఇంగ్లాండ్ కూడా కష్టాల కడల నుంచి పట్టుదలతో బయటపడింది అని చెప్పాలి.

 అదే సమయంలో చివరిలో పాకిస్తాన్ స్టార్ బౌలర్ షాహిన్ ఆఫ్రిది గాయపడటం ఇంగ్లాండ్ జట్టుకు కలిసి వచ్చింది. అయితే వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమి తర్వాత ఇదే విషయంపై మాట్లాడాడు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజాం. తొలి రెండు మ్యాచ్లు ఓడి వరసగా నాలుగు మ్యాచ్లు గెలిచి ఇక్కడి వరకు రావడం ఎంతో గొప్ప. ఇంకో 20 పరుగులు అదనంగా చేసి ఉంటే బాగుండేది. కానీ మా బౌలర్లు అద్భుతంగా పోరాడారు. దురదృష్టవశాత్తు షాహిన్ ఆఫ్రిది గాయపడ్డాడు. అది ఆటలో భాగం అయినప్పటికీ అతను జట్టులో ఉండి ఉంటే మాత్రం ఫలితం వేరేలా ఉండేది అంటూ బాబర్ చెప్పుకొచ్చాడు. తమది వరల్డ్ లోనే బెస్ట్ బౌలింగ్ ఏటాకింగ్ బౌలింగ్ అంటూ చెప్పుకొచ్చాడు బాబర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: