అది అవమానకరం.. ఇండియాకు ఫైనల్ వెళ్లే అర్హత లేదు : అక్తర్

praveen
ఆస్ట్రేలియా వెదికిగా జరిగిన టి20 వరల్డ్ కప్ లో భాగంగా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన టీమిండియా జట్టు సెమీఫైనల్ లో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయింది. అయితే ఇలాభారత జట్టు ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోవడంపై ఎంతోమంది భారత క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అని చెప్పాలి. ఇక మరోవైపు మాజీ క్రికెటర్లు సైతం టీమిండియా ఓటమిపై స్పందిస్తూ ఇక తమ అభిప్రాయాన్ని అందరితో పంచుకుంటున్నారు. ఇక టీమిండియా ఓడిపోతే ఎంతో సంతోషపడే పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లు సైతం భారత జట్టు ఓటమిపై స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేస్తూ ఉండడం గమనార్హం.

 ఈ క్రమంలోనే ఎప్పుడు టీమిండియా ఆటగాళ్ల ప్రదర్శన పై బీసీసీఐపై తన అక్కస్సు ను వెళ్లగక్కే పాకిస్తాన్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ సైతం మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశాడు. టీం ఇండియా ఓడిపోవడంతో ఏకంగా భారత జట్టున అవమానపరిచే విధంగా సంచలన వ్యాఖ్యలు చేశాడు అని చెప్పాలి. ఇక ఇలా మరోసారి షోయబ్ అక్తర్ తన అక్కస్సును వెళ్ళగక్కడం ప్రస్తుతం సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. ఇంతకీ పాకిస్తాన్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ టీమ్ ఇండియా ఓటమిపై ఏమన్నాడంటే..
 టి20 వరల్డ్ కప్ సెమీఫైనల్ లో ఇంగ్లాండ్ చేతిలో భారత్ అవమానకరమైన రీతిలో ఓడిపోయి వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించింది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రత్యర్థికి ఏమాత్రం పోటీ ఇవ్వకుండా రోహిత్ సేన చేతులెత్తేసింది అంటూ వ్యాఖ్యానించాడు. ఇలా ఇంగ్లాండ్ చేతిలో టీమిండియా కు దారుణమైన ఓటమి చవిచూసింది అంటూ వ్యాఖ్యానించాడు. ఈ ఆటతో  ఇండియాకు ఫైనల్కు చేరే అర్హత లేదు అంటూ అభిప్రాయపడ్డాడు. 5 ఓవర్లలో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లు బ్యాటింగ్ చూసినప్పుడు ఇక బౌలర్లు చేతులెత్తేసారు. కనీసం ప్రతిఘటించలేదు. బౌలర్లు రౌండ్ ద వికెట్,  బౌన్సర్లు వేయాల్సింది అంటూ షోయబ్ అక్తర్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: