కాలం ఒకేలా ఉండదు.. అప్పుడు తిట్టినోడే.. ఇప్పుడు చప్పట్లు కొట్టాడు?

praveen
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు.. బండ్లు ఓడలు.. ఓడలు బండ్లుగా మారుతాయి అనే సామెత ఎంతో మంది విషయంలో నిజం అని నిరూపితం అవుతూ ఉంటుంది. ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్మెన్ అలెక్స్ హేల్స్ విషయంలో కూడా ఇది నిజం అయింది అని చెప్పాలి. ఇటీవలే పటిష్టమైన టీమిండియా పై ఏకంగా సెమీఫైనల్ లో భాగంగా విరోచితమైన ఇన్నింగ్స్ ఆడి జట్టుకు విజయాన్ని అందించింది అలెక్స్ హేల్స్ అనే చెప్పాలి.  మరోవైపు నుంచి బట్లర్ మంచి ఇన్నింగ్స్ ఆడినప్పటికీ ఇక అతన్ని మించిన బ్యాటింగ్ తో అలెక్స్ హేల్స్ రెచ్చిపోయాడు. దీంతో ఎంతో అలవోకగా టీమిండియా పై విజయం సాధించగలిగింది ఇంగ్లాండ్ జట్టు.

 ఇదే అలెక్స్ హేల్స్ ఒకప్పుడు తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కొన్నాడు. 2019 వరల్డ్ కప్ కు ముందు రీక్రియేషనల్ డ్రగ్స్ తీసుకున్నాడు అలెక్స్ హేల్స్. ఇక ఈ విషయం బయటకు రావడంతో అతనిపై మూడు వారాలను విధించింది ఆ దేశ క్రికెట్ బోర్డు. ఈ మూడు వారాలు కాస్త మూడు సంవత్సరాలుగా మారిపోయాయి. అప్పుడు కెప్టెన్ గా ఉన్న ఇయాన్ మోర్గాన్ ఇలా డ్రగ్స్ తీసుకోవడాన్ని ఎంతో పెద్ద తప్పుగా పరిగణించాడు. అయితే అతను తీసుకున్న డ్రగ్స్ ప్రమాదకరమైన వేమీ కాదు. కానీ మొత్తంగా నేను కెప్టెన్గా ఉన్నన్ని రోజులు నువ్వు జట్టులోకి రాలేవు అనే సంకేతాలను అలెక్స్ హేల్స్ ఇచ్చాడు ఇయాన్ మోర్గాన్.

 చివరికి అదే జరిగింది ఇయాన్ మోర్గాన్ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత బట్లర్ చేతికి కెప్టెన్సీ వెళ్ళాక.. అలెక్స్ హేల్స్ జట్టులోకి వచ్చాడు. అయితే అప్పటికే వరల్డ్ కప్ జట్టు ప్రకటన పూర్తవడంతో ఇక వరల్డ్ కప్ జట్టులో అతనికి స్థానం దక్కలేదు. కానీ అదృష్టవశాత్తు ఇక స్టార్ బ్యాట్స్మెన్ జానీ బెయిర్ స్టో గాయం కారణంగా దూరం కావడంతో జట్టులోకి వచ్చాడు. వచ్చి ఎక్కడ వెనక్కి తిరిగి చూసుకోలేదు. మెరుపు ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు. ఇక ఇప్పుడు ఇంగ్లాండ్ తరఫున టాప్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు. ఒకప్పుడు అలెక్స్ హిల్స్ ని తిట్టిన ఇయాన్ మోర్గాన్.. మొన్న టీమిండియా పై అద్భుతమైన ఇన్నింగ్స్ సమయంలో కామెంట్రీ ప్యానెల్ నుంచి అతని ఇన్నింగ్స్ ను మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. ఏకంగా చప్పట్లతో ప్రశంసలు కురిపించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: