అదరగొట్టిన సూర్యకుమార్.. ఒకే దెబ్బకు మూడు రికార్డులు?

praveen
టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ సూర్య కుమార్ యాదవ్ ప్రస్తుతం హిట్టింగ్ అనే మంత్రంతో దూసుకుపోతూ ఉన్నాడు. ప్రత్యర్థి  ఎవరైనా తనకు బౌలింగ్ చేస్తుంది ఏ బౌలర్ అయిన సరే కూడా తన ఆటతీరులో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు అని చెప్పాలి. మైదానానికి నలువైపులా కూడా అద్భుతమైన షాట్లు ఆడుతూ తనకు వచ్చిన మిస్టర్ 360 ప్లేయర్ అనే బిరుదును సార్థకం చేస్తున్నాడు అని చెప్పాలి . ఇక ఇటీవల జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో మరోసారి అద్భుతమైన ప్రదర్శన చేశాడు. 25 బంతుల్లోనే సిక్సర్లు ఫోర్లతో  చెలరేగిపోయి 61 పరుగులు చేశాడు.

 ఇక మాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా అందుకున్నాడు. అంతేకాదు ఇక ఒక్క ఇన్నింగ్స్ తో మూడు అరుదైన రికార్డులను కూడా ఖాతాలో వేసుకున్నాడు సూర్య కుమార్ యాదవ్. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం..
 టి20 వరల్డ్ కప్ లో అత్యంత తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన జాబితాలో సూర్య కుమార్ యాదవ్ నాలుగవ స్థానంలో చోటు సంపాదించుకున్నాడు. 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కులు అందుకున్నాడు. ఇతని కంటే ముందు యువరాజ్ సింగ్ 12, 20  బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించగా.. కేఎల్ రాహుల్  స్కాట్లాండ్ పై 18బంతుల్లో ఈ రికార్డు అందుకున్నాడు.

 టి20 వరల్డ్ కప్ లో 100 కంటే ఎక్కువ బంతులు ఆడి అత్యధిక స్ట్రైక్ రేట్ కలిగిన జాబితాలో సూర్యకుమార్ అగ్రస్థానంలో నిలిచాడు. ఈ ఏడాది వరల్డ్ కప్ లో 193.96 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేస్తున్నాడు సూర్యకుమార్. అతని తర్వాత మైకేల్ హస్సి, లూక్ రైట్, గ్లెన్ ఫిలిప్స్, కెవిన్ పీటర్సన్ ఎక్కువ స్ట్రైక్ రేట్ తో ఉన్నారు.
 ఇక టి20 క్రికెట్లో టీమిండియా తరఫున చివరి 5వ ఓవర్లలో ఎక్కువ పరుగులు సాధించిన బ్యాట్స్మెన్ జాబితాలో సూర్యకుమార్ మూడో స్థానంలో ఉన్నాడు. అంతకుముందు కోహ్లీ ఆఫ్ఘనిస్తాన్ పై 63, 2007 ప్రపంచ కప్ లో యువరాజ్ 58 పరుగులు పిండుకున్నారు. ప్రస్తుతం సూర్య కుమార్ 56 పరుగులు రాబట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: