సెమీస్ వెళ్లకపోవడంపై.. బంగ్లా కెప్టెన్ ఏమన్నాడో తెలుసా?

praveen
టి20 వరల్డ్ కప్ లో భాగంగా నేటి వరకు సూపర్ 12 మ్యాచ్లు ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగాయ్. ముఖ్యంగా గ్రూప్ వన్ లో భాగంగా అటు సెమీఫైనల్ వెళ్ళబోయే రెండు జట్లు ఏవి అన్న విషయంపై పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చింది. కానీ గ్రూప్-2 లో భాగంగా ఇక సెమి ఫైనల్ రేస్ కోసం ఎన్నో జట్ల మధ్య పోటీ జరిగింది అని చెప్పాలి. అయితే ఇలా సెమీఫైనల్ రైస్ కోసం పోటీ జరగడానికి వెనుక ఒక పెద్ద కారణమే ఉంది  ముందుగా ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ అనుకున్న ప్రకారం సౌత్ ఆఫ్రికా తో పాటు టీమ్ ఇండియా జట్లు సెమీఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నాయని మిగతా జట్లు ఎంత పోరాడినప్పటికీ ఇక ఇంటి దారి పట్టడం ఖాయమని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో పసికూన నెదర్లాండ్స్ చేతిలో సౌత్ ఆఫ్రికా ఓడిపోయింది.

 దీంతో వరల్డ్ కప్ లో భాగంగా సమీకరణలు ఒక్కసారిగా మారిపోయాయి అని చెప్పాలి. సెమీఫైనల్ వెళ్తుంది అనుకున్న సౌతాఫ్రికా కాస్త నెదర్లాండ్స్ చేతిలో ఓడిపోయి చివరికి వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో ఇక ఇంటికి వెళ్తాయి అనుకున్న బంగ్లాదేశ్ పాకిస్తాన్ జట్లకు అటు సెమీఫైనల్ వెళ్లేందుకు ఒక సువర్ణ అవకాశం వచ్చింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవల సూపర్ 12 మ్యాచ్లలో భాగంగా పాకిస్తాన్ బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ ఎంతో హోరాహోరీగా జరిగింది.

 ఇక ఈ మ్యాచ్ లో మంచి ప్రదర్శన చేసిన పాకిస్తాన్  చివరికి విజయం సాధించి సెమీఫైనల్ అడుగుపెట్టింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే బంగ్లాదేశ్ కి కూడా పాకిస్తాన్ కు ఉన్నట్లుగానే సెమీఫైనల్ వెళ్ళేందుకు అవకాశం ఉన్నప్పటికీ చివరికి పేలవ  ప్రదర్శనతో ఓటమి చవిచూచింది. ఈ క్రమంలోనే తమ జట్టు ఓటమిపై బంగ్లాదేశ్ కెప్టెన్ షేకీబుల్ హసన్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. మిగతా వరల్డ్ కప్ టోర్నీతో పోల్చి చూస్తే ఈ ఏడాది మాత్రం తాము అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాము అంటూ చెప్పుకొచ్చాడు. ఇంకా కాస్త మెరుగైన ప్రదర్శన చేసి ఉంటే సెమిస్కు చేరే వాళ్ళం అంటూ తెలిపాడు   అలా జరగకపోవడం బాధ కలిగిస్తుంది అంటూ  చెప్పుకొచ్చాడు. ఇక వ్యక్తిగతంగా తన ప్రదర్శన పట్ల నిరాశతో లేనని తాను ఫిట్గా ఉన్నంతకాలం క్రికెట్ ఆడతాను అంటూ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: